Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సిపిఐ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

విశాలాంధ్ర-కందుకూరు: సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్లో జరుగుతాయని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూసి సురేష్ బాబు అన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో సిపిఐ జాతీయ మహాసభల గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు. చాలా సంవత్సరాల తర్వాత విజయవాడ నగరంలో సిపిఐ జాతీయ మహాసభలు జరుగుతున్నందున మహాసభల నిర్వహణకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ఇద్దరు వ్యక్తులకు తాకట్టు పెడుతూ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నాడని ఆరోపించారు. హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి ఆటలు కట్టించేందుకు వామపక్ష శక్తుల ఐక్యత అవసరమని ఆయన అన్నారు. భారతదేశ సిరసంపదలను బడా పెట్టుబడిదారులకు దారా దత్తం చేసే నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలపై సిపిఐ నిరంతర పోరాటాలకు సిద్ధమవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలన జగన్మోహన్ రెడ్డి రిమోట్ పాలనగా కొనసాగుతుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు మంగళం పాడి రెండు మూడు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే రాష్ట్రం అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల నిరంకుశ విధానాన్ని విడనాడాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి మాలకొండయ్య నియోజకవర్గ సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్ సిపిఐ సీనియర్ నాయకులు డి ఆదినారాయణ కే మురళీకృష్ణ జే రమణయ్య ఏఐవైఎఫ్ నాయకులు కే హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img