Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

శుక్రవారం మాలకొండ హుండీ లెక్కింపు.ఈ.ఓ.శ్రీనివాసరావు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని ప్రముఖపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని ఆలయకార్యనిర్వాహణాధికారి కె.బి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతప్రభుత్వం వారు 2000రూపాయల నోట్లు చెల్లుబాటుకు సెప్టెంబర్ -30వ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చినందున మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాలకొండలో ప్రస్తుతానికి 6వారాలకు సంబందించిన 20 హుండీలు నిండినందున శుక్రవారం (29-09-2023)మాలకొండ కొండ పైన దేవాలయం కళ్యాణమండపం నందు ఉదయం 9.00గంటలకు హుండీలు తెరిసి లెక్కించడం జరుగుతుందని ఆలయకార్యనిర్వాహణాధికారి కె.బి.శ్రీనివాసరావు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img