Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నెల్లూరు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా మాలకొండయ్య

విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు : సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా కందుకూరు కు చెందిన మాలకొండయ్యను సిపిఐ నెల్లూరు జిల్లా సమితి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. మాలకొండయ్య 1975 నుండి అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడిగా కందుకూరులోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య తరఫున ఆ కాలేజీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికై నాటినుండి భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తూ 1984 సంవత్సరంలో ఉపాధ్యాయ రంగంలో ప్రవేశించి ఉపాధ్యాయుడిగా ఎస్ టి యు లో జిల్లా అధ్యక్షుడిగా కార్యదర్శిగా రాష్ట్రస్థాయిలో పలు పదవులు చేపట్టి ఉపాధ్యాయ ఉద్యమానికి కృషి చేసినారు 2014లో ఉపాధ్యాయ ఇల్లుగా పదవీ విరమణ పొందిన నాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ ఎన్నో ఉద్యమాలలో తనకంటూ ఒక ప్రత్యేక చాటుకున్న వ్యక్తి మాలకొండయ్య 2017 లో కందుకూరు నియోజకవర్గం కార్యదర్శిగా ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తూ జిల్లాల విభజన అనంతరం 2022లో నెల్లూరు జిల్లా లో కందుకూరు ప్రాంతం విలీనం కావడంతో ఆయన నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు నెల్లూరు జిల్లా మహాసభ అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్న మాలకొండయ్యను జిల్లా సమితి సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మాలకొండయ్య మొదటినుండి అంబేద్కర్ ఇజం మోక్సిజం పైన ఎంతో అధ్యయనం చేయడమే కాక వాటిపైన కందుకూరులో పలుసార్లు సదస్సులు నిర్వహించి మాక్సిజన్ అంబేద్కర్ ఇజం పై ఎన్నో మంది ప్రముఖులను చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేయించిన వ్యక్తి మాలకొండయ్య. జిల్లాలో పార్టీకి సేవలను అందించేందుకు ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తనపై ఈ బాధ్యతను పెట్టినటువంటి సమితి సభ్యులకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ జిల్లా కార్యదర్శి దామా అంకయ్యలకు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img