Friday, October 7, 2022
Friday, October 7, 2022

మీటర్ల జీవో రద్దు చేయాలి

విశాలాంధ్ర – ఉదయగిరి : వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు లను పెట్టే జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది శుక్రవారం మండల పరిధిలోని శకునాల పల్లిలో రైతు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించే పంటలను కొనుగోలు చేయాలన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు ఉపాధి హామీ పథకం పనులు గ్రామాల్లో చేపట్టాలన్నారు ఆ పథకం ద్వారా ప్రజలకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించి న్యాయం చేయాలన్నారు హెల్త్ సెంటర్లలో డాక్టర్లను నియమించాలన్నారు మండలంలోని అన్ని పంచాయతీలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా లు నిర్వహిస్తున్నట్లు రైతు నాయకులు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు నాయకులు సానుభూతిపరులు పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో రైతు నాయకులు గ్రామ రైతులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img