Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శిశువుకు ముర్రుపాలే శ్రేయస్కరం : డాక్టర్ ప్రత్యూష

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : అప్పడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలే శ్రేయస్కరమని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం డాక్టర్ ప్రత్యూష అన్నారు. మంగళవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఏ యన్ యం లకు తల్లిపాలు వారోత్సవాలపై పీ హెచ్ సీ డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ముర్రుపాలు బిడ్డకు టీకాలా పనిచేస్తుందని, బిడ్డపుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే బిడ్డ తల్లికి ఆరోగ్యమని అన్నారు బిడ్డకు తల్లిపాలతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా సీ హెచ్ ఓ శివరామయ్య మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత మరియు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని అన్నారు.తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1నుంచి ఆగస్టు 7వరకు జరుగుతాయని అన్నారు.ఈ సందర్బంగా ఐసీ డీయస్. సూపర్వైజర్ విక్టోరియా మాట్లాడుతూ నవజాత శిశువుకు తల్లిపాలు అమృతముతో సమానమని అన్నారు. పుట్టినబిడ్డకు ముర్రుపాలు తాగిస్తే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతాడని అన్నారు.తల్లిపాలు ప్రాముఖ్యతను బాలింతలకు, గర్భవతులకు వివరించారు. అనంతరం తల్లిపాలు వద్దు -డబ్బా పాలు ముద్దు అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ బస్టాండ్ వరకుర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీ హెచ్ ఓ శివరామయ్య,పీహెచ్ యన్. నవమని, హెచ్.యస్.బాలరాజు,అంగన్వాడీ లు, ఏ యన్ యం లు, ఆచాలు గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img