Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నాడు – నేడు పనులు ప్రారంభం

విశాలాంధ్ర – ఉలవపాడు : మండల పరిధిలోని భీమవరం పంచాయతీలో గల భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నాడు నేడు పనులను ప్రారంభించారు గత ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పలు రకాల అభ్యంతరాల మధ్య ఎట్టకేలకు నాడు నేడు పనులు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు
పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు పాఠశాల సిబ్బంది నాడు నేడు పనులు ప్రారంభించారు ఈ పాఠశాలకు నాడు నేడు కింద సుమారు 69 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ అయ్యాయని వారు తెలిపారు
గతంలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు పాఠశాల అభివృద్ధికి సహకరించకపోవడంతో గ్రామస్థులు
ఆందోళనతో జిల్లా విద్యాశాఖ అధికారి రంగ ప్రవేశం చేసి గ్రామస్తుల ఆందోళన విరమింప చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నాడు నేడు పనులు ప్రారంభించేందుకు సహకరించిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ మరియు గ్రామస్థులు చొరవతోపాఠశాలల రూపురేఖలు మారుతాయనితమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img