Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పద్మ విభూషణ అవార్డ్ ప్రకటించాలి

జయంతి సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కేవీ చలమయ్య విజ్ఞప్తి

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పద్మ విభూషణ అవార్డు ప్రకటించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు కేవీ చలమయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఆయన 90 వ జయంతి సందర్భంగా ఆయన స్వగృహంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవంగా రాజకీయ నేతగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు ఆయన పేరుతోఁస్మృతి వనంఁఏర్పాటు పద్మ విభూషణ అవార్డు ప్రకటించేందుకు కార్పొరేషన్ లో ప్రత్యేక తీర్మానం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి కి కార్పొరేషన్ మేయర్ పొట్లూరు స్రవంతికి శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సంఘ సభ్యులు ఆర్ విశరత్చంద్ర నగర కంటి రవీంద్రనాథ్ పొల్లేటి నాగేశ్వరరావు సోమిశెట్టి వెంకటరత్నం రాయవరపు కళ్యాణ చక్రవర్తి దర్శి నరసింహారావు పేర్ల జనార్ధన్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఆర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img