Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

పరసా కస్తూరమ్మ సేవలు మరువలేనివి

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విశాలాంధ్ర నాయుడుపేట రూరల్:- మాజీ మంత్రివర్యులు పరసా వెంకటరత్నం సతీమణి కస్తూరి రత్నం ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం నాయుడుపేట ఏ.ఎల్.సి.ఎం గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరసా కస్తూరమ్మ సేవలు మరువలేనివని, ఆమె ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతురాలని కొనియాడారు. అదేవిధంగా పరసా కుటుంబంతో ఎన్నో సంవత్సరాల నుండి తమకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. అనంతరం వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సేవా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img