Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

విశాలాంధ్ర – నెల్లూరు : ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్శ్రీ కే వీ ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.

నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ టి. బాపిరెడ్డిలతో కలిసి స్పందన కార్యక్రమం ప్రారంభించి వివిధ ప్రాంతాల ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా కేంద్రానికి అర్జీలు ఇచ్చెందుకోసం వస్తుంటారని వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారి అర్జీలను సానుకూల దృక్పథంతో పరిశీలించి సముచిత రీతిలో నిర్నిత గడువులోగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి మంగళవారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారము స్పందన అర్జీల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమీక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పదేపదే వచ్చిన దరఖాస్తులే మరలా వస్తున్నాయని వాటిని వీలైనంత మేరకు సరైన పద్ధతిలో తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిష్కారం అవుతున్న అర్జీల విషయంలో జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి అర్జీల పరిష్కారంలో నాణ్యతను గమనించి క్షేత్ర స్థాయి అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. అర్జీదారులు ఏదైనా పథకానికి అర్హులు కాకపోతే వారికి ఎందువల్ల వర్తించదో స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియపరచాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ డ్వామా పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకటరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకరరాజు, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీమతి పద్మ, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ. శ్రీ రంగ వరప్రసాద్, ఎల్ డి ఎం శ్రీ శ్రీకాంత్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య మెప్మా పీడీ శ్రీ రవీంద్ర, జిల్లా రిజిస్ట్రార్ శ్రీ బాలాంజనేయులు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img