ఏపీ విశ్రాంతి ఉద్యోగులు డిమాండ్
కోవూరు. విశాలాంధ్ర. రాష్ట్ర ప్రభుత్వం నుండి విశ్రాంతి ఉద్యగులకు ప్రతి నెల 1వ తేదిన, పింఛను చెల్లించాలని, ఏపీ ప్రభుత్వవిశ్రాంతి ఉద్యోగులు సంగం, కోవూరు శాఖ, అధ్యక్షులు, అప్పలసుబ్బారావు డిమాండ్ చేసారు, కోవూరు లోని బైనా సన్స్ కల్యాణ మండపములో మంగళవారం జరిగిన సర్వ సభ్యులు సమావేశములో మాట్లాడారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛను దారులకు, రావలిసినDA బకాయిలు, EHS పథకం ను సక్రమంగా అమలు చెయ్యాలని, పింఛను దారులు పట్ల, ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేసారు, ఏదయినా సమస్య లు ఉన్న యెడల సంగం ద్రుష్టి కి పెడితే, పరిష్కారం చేసెందుకు చర్యలు తీసుకొంటామని, కార్యదర్శి, s, జయరామయ్య అన్నారు, ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు గా విచ్చేసిన, కోవూరుసబ్ ట్రెజరర్ అధికారి, పు, కిరణ్ కుమార్ ను, పలువురు శాలువాతో సన్మానించారు, ఆయనకూడ ప్రశంగించారు, ఈ కార్యక్రమం ప్రతి మాసము, నాలుగు వ మంగళవారం నిర్వహించడం జరుగుతుంది అని ఉపాధ్యక్షలు గిరి కుమార్ అన్నారు, ఈ కార్యక్రమం లో ట్రెజరర్, అగ్ని వెంకయ్య, జాయింట్ సెక్రటరీ, అదిశేషియ్య, సురేంద్ర, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.