Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా తహసీల్దార్ కు వినతిపత్రం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుఅక్రమ అరెస్టు ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చం నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు లిఎమ్మెస్ రాజు ఆదేశాలతో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సూచనల మేరకు బుధవారం వలేటివారిపాలెం మండలం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వలేటివారిపాలెం మండలం తహసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాదు చెన్నకేశవులు, వలేటివారిపాలెం గ్రామ సర్పంచ్ సాదు శ్రీలత, మండల తెలుగు యువత అధ్యక్షుడు బద్దిపూడి శిఖామణి, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు జడ రవీంద్ర, ప్రేముల నాగభూషణం, ఎండ్లూరి అంజయ్య, చిన అంజయ్య, సాదు హనుమంతరావు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img