Friday, August 19, 2022
Friday, August 19, 2022

టిడిపి సభ్యత్వం ఉంటే విద్యా వైద్యం లో ప్రాధాన్యత

విశాలాంధ్ర – ఉదయగిరి : తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు వైద్యం తో పాటు వారి పిల్లలకు కొన్ని పాఠశాలలో విద్యకు ప్రాధాన్యత కల్పిస్తామని స్థానిక మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు అన్నారు శనివారం మండల పరిధిలోని అప్పసముద్రం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అన్నారు మహిళలు యువకులను పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా గతం కంటే ఈసారి ఎక్కువ శాతం సభ్యత్వ కార్యక్రమం నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ నాయకులు భాస్కర్ రెడ్డి వెంగయ్య మానుకోండి వెంకటేశ్వర్లు చల్ల కొలుసు రమణయ్య సాయి శివకృష్ణ రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img