విశాలాంధ్ర వలేటివారిపాలెం. : మండలంలోని పోలినేనిపాలెం గ్రామంలో వీధి దీపాలు మరమ్మతులకు గురికావటంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో స్పందించిన అనుమోలు అమరేశ్వరి,ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు మరమ్మతులు చేయించారు
గ్రామ సర్పంచ్ గా,సర్పంచ్ సభ్యులగా ప్రజలు ఎన్నుకున్నందుకు వారి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యంగా సర్పంచ్ అనుమోలు అమరేశ్వరి,ఎంపీటీసీ సభ్యులు చింతపూడి రవీంద్ర నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల వివరాలు సేకరించి పరిష్కరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. వీధిదీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని విద్యుత్ సిబ్బంది ని కోరారు. సకాలంలో స్పందించి వీధిలైట్లు వెలిగేలా చూసిన పంచాయితీ సర్పంచ్ అనుమోలు అమరేశ్వరిని,ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర ని ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు అనుమోలు సుబ్బారావు, రాములు విద్యుత్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.