డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికను సద్వినియోగం చేసుకొని నగర ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆకాంక్షించారు. కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా చెన్నుడు మాట్లాడుతూ వివిధ విభాగాలకు సంబంధించి 15 విజ్ఞాపన పత్రాలను పరిష్కారం కోసం అందుకున్నామని, వాటన్నిటికీ వీలైనంత త్వరలో పరిష్కారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. స్పందన పరిష్కార వేదిక కార్యక్రమంలో నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.