Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట

పాల్గొన్న మేయర్ స్రవంతిజయవర్ధన్

నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆదేశాలతో స్థానిక 12వ డివిజన్ వావిలేటిపాడు, హరిజనవాడలో “శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ను స్థానిక ప్రజలు, వై.సి.పి నాయకులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా హరిజనవాడ లోని గడప గడపకు మేయర్ పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అమలు తీరును పర్యవేక్షించారు. స్థానిక సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆదేశాలతో గడప గడపకు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించిన సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. సంక్షేమ పథకాల అమలు కోసం సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలు అత్యంత కీలకమని, స్థానిక సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న కృషి అభినందనీయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, ప్రజలు, వై.సి.పి.నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img