Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

12 న నెల్లూరులో శ్రీమంత్ తాళ్లపాక అన్నమాచార్య జయంతి వేడుకలు

విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు : శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్య వారి614 జయంతి వేడుకలు ఈనెల 12వ తేదీ నెల్లూరులోని అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించ జరుగుతుందని శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవ కమిటీ ముఖ్య సమన్వయకర్త తుంగ శివప్రభాత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాగుంటుందని “లాయర్” వార పత్రికకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు మినీ బైపాస్ లోని అన్నమయ్య సర్కిల్ లో అన్నమయ్య విగ్రహం వద్ద శనివారం సాయంత్రం అన్నమయ్య విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడ నుండి అన్నమాచార్య కీర్తనలతో నగర సంకీర్తన చేసుకుంటూ విపిఆర్ కళ్యాణమండపం కు చేరుకోవడం జరుగుతుంది విపిఆర్ కళ్యాణ మండపంలో అన్నమయ్య సంకీర్తన వలి అర్థం ఆలాపన అభినయం కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమం శ్వేత మాజీ సంచాలకులు భూమన్ భావవ్యక్తీకరణ చేస్తారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కే సరస్వతీ ప్రసాద్ గాన ఆలాపన చేస్తారు నెల్లూరు గురుకృప కళాక్షేత్రం వారిచే నాట్యరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంలోని ఆధ్యాత్మిక సంగీత సాహిత్య సాంస్కృతిక ఆరాధకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొనే వారంతా కూడా కచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని నిర్వాహకులు కోరారు ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు ఎన్ బలరామయ్య నాయుడు, దండమూడి హేమంత్ కుమార్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img