Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

SSLV – D1 రాకెట్ ప్రయోగం

విశాలాంధ్ర – సులూరుపేట : తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఆదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు SSLV -D1 రాకెట్ ను ప్రయోగించనున్నారు, ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం శాస్త్రవేత్తలు ఎం ఆర్.ఆర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రాకెట్ కౌంట్ డౌన్ సమయం ఆదివారం ఉదయం2.18 గంటలకు ప్రారంభమై 7:00 గంటలపాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన అనంతరం ఆదివారం ఉదయం 9.18 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు. ఈ సిరీస్ఇ ది మొదటి ప్రయోగం కావడం తో పాటు చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ప్రయోగించడానికి రూపొందించిన చిన్న రాకెట్ కావడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు, ఈ రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జార్వేషన్ శాటిలైట్ – 02 తో పాటుగా స్పేస్ కిడ్స్ ఇండియా ప్రోగ్రాం క్రింద దేశం లోని 750 ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు రూపొందించిన 8 kg లు బరువు కలిగిన ఆజాది శాట్ ను కూడా SSLV రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు, ఇందులో 75 రకాల పేలోడ్స్ను పొందుపరచడం జరిగింది ఒక్కొక్క పేలోడ్ బరువు 50 గ్రాములు ఉండేలా తయారు చేశారు , 132 కిలోల బరువు కలిగిన EOS -02 ఉపగ్రహం ప్రధానముగా భూ పరిశీలనకు,వ్యవసాయ భూముల గుర్తింపుకు,కోస్తా ప్రాంతాల పరిశీలనకు ,ప్రకృతి అధ్యనానికి ఉపయోగ పడుతుంది, 500 కిలోల బరువు గల ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడానికి SSLV రాకెట్ ప్రధానముగా ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలలోని అంతరిక్ష ప్రయోగాల వాణిజ్జ రంగం లో పోటీ పడటానికి ఇస్రో తక్కువ ఖర్చుతో తక్కువ బరువు గల ఉపగ్రహాలను ప్రయోగించడం లక్షంగా
ఈ SSLV రాకెట్ ను రూపకల్పన చేసింది, ఈ రాకెట్ ను తయారు చేయడానికి 7 నుండి 30 రోజులు మాత్రమే పడుతుంది అంతే కాకుండా ఈ రాకెట్ ప్రయోగ నిర్వహణకు కూడా తక్కువ మందితో జరిపించడానికి అవకాశాలు ఉన్నాయ్.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img