విశాలాంధ్ర .వెంకటగిరి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు… నేడు సాయంత్రం 3.30 గంటలకు శ్రీ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో… జరుగుతున్న “చలో రైతు పోరుబాట” కార్యక్రమానికి… వెంకటగిరి నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ. కురుగొండ్ల రామకృష్ణ, రాష్ట్ర టిడిపి కార్యదర్శి శ్రీ. గంగోడు నాగేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో…. వెంకటగిరి నియోజకవర్గంలోని రైతు సోదరులు, రైతు కూలీలు, కౌలు రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.