Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

తప్పిపోయిన బాలుని తల్లిదండ్రులకు వద్దకు చేర్చిన నెల్లూరు పోలీసులు

విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు : తప్పిపోయిన 4 సంవత్సరాల బాలుని గంటల వ్యవధిలో చేధించి తల్లిదండ్రులకు అప్పగించిన యస్.పి. విజయ రావు,నెల్లూరు టౌన్ లోని శ్రీ రాజరాజేశ్వరి గుడికి తల్లిదండ్రులతో వెళ్ళిన బాలుడు సవ్య సాక్షిక్ రెడ్డి.మధ్యాహ్నం 1 గంట సమయంలో తప్పిపోయినట్లు గ్రహించి పోలీసులకుఫిర్యాదుచేసినతల్లిదండ్రులు.వెంటనే బృందాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీసు యంత్రాంగంతో నాకా బంది ఏర్పాటు చేసి, చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలను అప్రమత్తం చేసిన జిల్లా యస్.పి మరోవైపు సాంకేతికత ఆధారంగా శోధించిన మరో బృందాలను ఏర్పాటు చేసి జల్లెడ పట్టిన నెల్లూరు పోలీసులు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద బాలుడిని కనుగొనిన నెల్లూరు పోలీసులు. 2 గంటలలో బాలుడిని కనుగొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన రబాలుని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడి, మీకు జీవితాంతం రుణపడి ఉంటామని జిల్లా యస్.పికి ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు అయిన కోన శ్రీకాంత్, ఇంద్రజనేరం జరిగిన 2 గంటల లోపలే సిబ్బంది అధికారులు సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగిస్తూ, ఈ కేసును చేదించుటలో క్రియాశీలకంగా పనిచేసి బిడ్డను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విజయరావు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img