Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎర్రజెండానే పేద ప్రజల అండ !

మోడీ , జగన్ ప్రజా వ్యతిరేక పాలన పై తిరగబడాలి !
సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపు

దేశంలో నరేంద్ర మోడీ ఆలోచన ప్రకారం ఆర్ఎస్ఎస్ చెప్తున్న దేవుడు గొప్పోడు అయితే పేద ప్రజల అండఎర్రజెండా ఒక్కటేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సులూరుపేట పట్టణ 2 వ సిపిఐ మహాసభ ఆనంద్ అధ్యక్షతన జరిగింది . ఈ పట్టణ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవినీతి మయం అయిందని నేను అధికారంలోకి వస్తే అవినీతి అంతం చేసి నల్లధనాన్ని వెనక్కి తెస్తానని ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తాను అందుకోసం మీరంతా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించుకోవాలని మోడీ చెప్పిన మాటలన్నీ బూటకంగా మారాయని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు . అవినీతి అంతం చేసే మాట ఎటో గాని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేసిన వాళ్లలో మోడీ దేశంలోనే ప్రథముడని అన్నారు . నేటి యువతను పక్కదారి పట్టించేందుకే అగ్నిఫద్ అనే కొత్త పథకాన్ని తీసుకురావడం దేశానికి యువతకు ప్రమాదకరంగా మారిందన్నారు . దేశంలో వ్యవసాయ కార్మికులను నీరుగార్చడానికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ వందరోజులు పని కల్పించకుండా చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా వ్యవసాయ కార్మికుల పట్ల వివక్షత చూపుతున్నాడని అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ ,డీజిల్ ధరలు పై వ్యాట్ విధిస్తూ మరింత భారాన్ని మోపుతున్నాడని పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పది రూపాయల నుండి 12 రూపాయలు దాకా అదనపు భారం ప్రజలపై పడిందన్నారు . అధికారం లోకి రాకమునకు జగన్మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని ప్రకటించి నేడు మద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ జగన్ అసలు రూపాన్ని చూపిస్తున్నాడని మండి పడ్డారు . ఈ తరుణం లో సిపిఐ జాతీయ మహాసభలు అక్టోబరు నెలలో విజయవాడ నగరం లో గొప్పగా జరుగుతున్నాయని , ఈ మహాసభల బహిరంగ సభకు రైళ్ళు , బస్సులు , లారీ లలో పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూచించారు . సిపిఐ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు పారసారథి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ నగరంలో పార్టీ విస్తరణకు రానున్న కమిటీ కొత్త పద్ధతులలో గ్రామాలకు విస్తరించాలని సూచించారు. ఆగస్టు 14, 15 తిరుపతి జిల్లా మహాసభలకు ఈ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కదలి రావాలని కోరారు. కరోనా కాలంలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు సిపిఐ చేసిందని వారు గుర్తు చేశారు. నగరంలో ఎక్కువమంది భవన నిర్మాణ కార్మికులు ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్స్ గ్రీన్ అంబాసిడర్స్ ఆటో కార్మికులు ఎక్కువగా ఉన్నారని వారందరికీ సంఘాల నిర్మాణం చేయాలని దాని ద్వారా పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆ దిశగా పట్టణంలో పార్టీ పనిచేయాలని సూచించారు ఈ మహాసభలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పారసారథి సుధాకర్ రెడ్డి ఆనందు నాగేంద్ర చెంచమ్మ బాలయ్య లక్ష్మి రమణయ్య బాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img