Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోని సుజల ప్లాంట్

ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో వెతలు

విశాలాంధ్ర ::కొండాపురం మండలం ఏళ్లు గడుస్తున్నా. ఆ పథకం ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. మూడేళ్లు దాటినా చుక్కనీరు ప్రజలకు అంద లేదు. విడతల వారీగా పనులు చేపట్టడంతో పనుల్లో జాప్యం జరిగింది. కొండాపురంలో ఏర్పాటు చేసిన మదర్‌ ప్లాంట్‌కు అన్నీ వసతులు చేకూరినా చుక్కనీరు ప్రజలకు అందడం లేదు. అధికారులేమో అదిగో..ఇదిగో ట్రయల్‌రన్‌ అంటూ కాలయాపన చేస్తున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని సుజల జలాలను ఈ ఏడాదైన అందించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మండలంలోని అధిక గ్రామాలలో మండలంలోని 19 పంచాయతీలు 52 మజారా గ్రామాలు ఉన్నాయి వీటిలో 21 గ్రామాల పరిధిలో ఫ్లోరిన్ ప్రభావం ఉందని అధికారులు తేల్చారు తూర్పు ఎర్రబెల్లి గ్రామపంచాయతీ లోని కిడ్నీ చెడిపోయి ఇతర అనారోగ్య సమస్యలతో యువకులు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. మండలంలోని తూర్పు ఎర్రబల్లి,పార్లపల్లి,మర్రిగుంట, పొట్టిపల్లి,ఇసకదామెర్ల,లింగనపాలెం, ఉప్పులూరు పంచాయతీల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉంది దీనితో ప్రజలు నీళ్లు కొనుగోలు చేసి తాగుతున్నారు ప్రజల సమస్యలను గుర్తించి గత తెదేపా ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో పథకాన్ని తీసుకు వచ్చారు మదర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మినీ ప్లాంట్లకు నీటిని నింపుతారు తక్కువ ధరకు వాటిని అందించాల్సి ఉంది కానీ ఈ ప్రక్రియ కొంత కాలంగా వేగవంతంగా కొనసాగింది ప్రభుత్వం మారడంతో ఏడాది తరువాత మరుగునపడింది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సుజల స్రవంతి పేరుతో నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించారు మదర్ ప్లాంటు 21 గ్రామాల్లో మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
పనులు పూర్తయిన త్రాగునీటికి అవస్థలు మదర్ ప్లాంట్ వద్ద నాలుగు బోర్లతో నిత్యం గంటకు 10 వేల లీటర్లు సుజల నీటిని ఉత్పత్తి చేస్తారు ట్యాంకర్ల ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండున్నర వేల నీటిని మినీ ట్యాంకర్ లకు నింపుతారు వీటిని తీసుకెళ్లేందుకు ప్రజలకు డిజిటల్ కార్డులు అందజేస్తారు మదర్ ప్లాంట్ మినీ ట్యాంకర్ లో పనులు పూర్తయ్యాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు కాలయాపన చేస్తున్నారు ఈ వేసవి కైనా త్రాగు నీటిని ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img