Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి ప్రభుత్వమే రైతులను దగా చేసింది

మంత్రి కాకాణి

విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు:నెల్లూరు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తున్నాం కొందరు టీడీపీ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియకపోయిన మాట్లాడుతున్నారు.
గతంలో 13 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండుతుంటే ప్రస్తుతం 16 లక్షల టన్నుల ధాన్యం పండుతోంది.రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. కానీ కొన్ని మీడియాల్లో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వ్యవసాయం గురించి పరిజ్ఞానం ఉన్నవారికి వాస్తవాలు తెలుసు
బహిరంగ మార్కెట్ లో కనీస మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రైతులను దగా చేశారు.చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే..కొన్ని పత్రికల్లో పొంతన లేని వార్తలు రాస్తున్నారు.టిడిపి హయాంలోనే. 2017 నెల్లూరు లోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగింది. రైతులను అప్పట్లో మోసం చేశారు, ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారు. రైతులకు బోనస్ పేరుతో టిడిపి హాయంలో బోగస్ జి.ఓ.లు ఇచ్చి తప్పుదోవ పట్టించారు.*
టిడిపి హయంలో సివిల్ సప్లైస్ ను నిర్వీర్యం చేశారు. ప్రతి రైతును ఆదుకోవాలనే లక్ష్యంతో జగన్ హయాంలో ఈ క్రాప్ విధానాన్ని తీసుకు వచ్చాం, నేరుగా రైతుల ఖాతాల్లోకి. నిధులు వేస్తున్నాం.
ఆర్.బి.కె.ల ద్వారా ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపుతున్నాము. రైతులకు సహకారం ఇస్తున్నాం.
ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తున్నాం. ధాన్యం సేకరణలో లక్ష్యం తగ్గించారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.టిడిపి ప్రభుత్వ హయంలో పౌర సరఫరాల సంస్థ కోసం నాబార్డ్ తెచ్చిన నిధులను పసుపు..కుంకుమ కింద చంద్రబాబు అడ్డగోలుగా పంపకాలు చేశారు. రైతులను అడుగడుగున మోసం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ బకాయిలను మేము చెల్లించాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఎప్పుడు అండగా ఉంటుంది అని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img