Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదల సంక్షేమమేప్రభుత్వ లక్ష్యం

గుర్తించిన సమస్యలు వారంలోగా పరిష్కరించాలి
యంఎల్ఏ మహీధర్ రెడ్డి

విశాలాంధ్ర వలేటివారిపాలెం. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని బడేవారిపాలెం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రొండవ రోజు గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకొన్నారు.ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చేసేచర్యలు తీసుకొంటున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రం లోని అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.అభివృద్ధి పథకాలు ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రజల్లోకి తీసుకోని వెళ్తూ ప్రభుత్వం జోరుగుర్రాల స్వారీ చేస్తుందని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక పార్టీలకతీతంగా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకపాలన అందిస్తున్నారని అన్నారు. గడపగడపమన ప్రభుత్వం కార్యక్రమంలో యంపిటిసి ఇంటూరి భారతి, యంపీపీ పొనుగోటి మౌనిక,యస్ ఐ సుదర్శన్ యాదవ్,ఎంపీడీవో రఫిక్ అహ్మద్, ఏ.ఓ.హేమంత్ భరత్ కుమార్,డాక్టర్ శ్రీనివాసులు,ఆర్.ఐ.నర్సయ్య, విద్యుత్ ఏ.ఈమధుబాబు, మండలసలహాదారు ఇంటూరి హరిబాబు, మాజీ యంపిటీసి పొడపాటి నరసింహం, చంద్రమౌళి,డీలర్ లక్ష్మీనరసింహం, సర్పంచ్ లు డేగా వెంకటేశ్వర్లు,ఓబులుకొండయ్య,సతీష్, దుగ్గిరాల రాఘవలు, వింజం వెంకటేశ్వర్లు, యంపిటిసీలు చింతలపూడి రవీంద్ర,యానాది,ఉప సర్పంచ్ గురిజాల క్రిష్టయ్య, మాజీ సర్పంచ్ సంజీవి రెడ్డి,కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అనుమోలు వెంకటేశ్వర్లు,కుంబాల క్రాంతి,కట్టాహనుమంతురావు,పరిటాల వీరాస్వామి,గుత్తా గోపి, ఇరుపని అంజయ్య,అనుమోలు లక్ష్మీనరసింహం,అనుమోలు సుబ్బారావు,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,యాళ్ల హరిబ్రహ్మ రెడ్డి, బొమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి, పల్లాల వెంకటేశ్వరరెడ్డి,బాపతు మాలకొండారెడ్డి, దాచర్ల రాఘవ, కొల్లూరి గోవిందు,కొల్లూరి నర్సయ్య,కొల్లూరి శ్రీనివాసులు, కంచర్ల బాలాజీ,కంచర్ల వేణు,కంచర్ల కోటయ్య,తోకల నరసింగరావు,మద్దాలి రామారావు,బొమ్మల మాలకొండయ్య,ఉన్నం వెంకటేశ్వర్లు,బొమ్మినేని నరసింహం, మన్నం వెంకటరమేష్,వడ్లమూడి, నర్సయ్య,గడ్డం మాధవరావు,గొర్రెపాటి సురేష్,అనుమోలు సుబ్బారావు,ప్రగడ రవి,దాసరి సింహాద్రి, దండెబోయిన కిషోర్,గోళ్ళ సతీష్,దివి వీరయ్య, కార్యదర్శి మాదవి,పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సచివాల సిబ్బంది వలంటీర్లు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img