Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

రేబాల గ్రామంలో చెలరేగిన దొంగలు..!

. 15 సవర్ల బంగారం 35 వేల రూపాయలు చోరీ

విశాలాంధ్ర – బుచ్చిరెడ్డిపాలెం: బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో గత రాత్రి దొంగలు వరుస చోరీలు చేశారు. గ్రామంలోని రెండిళ్లలో 15 సవర్ల బంగారం 35 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. స్థానిక ఉమ్మడి తోపులో నివాసం ఉండే జఫీర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లడంతో వేకుజామున ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువాలోని 12సవర్ల బంగారు నగలు 10వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇదే గ్రామంలోని సైదాని అనే వ్యక్తికి చెందిన మరో ఇంట్లో సైతం ఎవరూ లేకపోవడాన్ని అదునుగా తీసుకున్న దొంగలు ఇంట్లో చొరబడి బీరువాలోని మూడు సవర్ల నగలు 25 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై వీర ప్రతాప్ క్లూస్ టీం సిబ్బందితో కలిసి ఇళ్లను పరిశీలించి స్థానికులను విచారించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img