Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తిరుపతి విద్యాశాఖ అధికారి ఆకస్మికతనిఖీ

విశాలాంధ్ర _ నాయుడుపేట : నాయుడుపేట పట్టణ,మండలపరిధిలో శనివారం తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ తొలుతా జిల్లాపరిషత్ బాయ్స్ హైస్కూల్ , సందర్శించి నాడు నేడు పనులను పరిశీలించారు. విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయునితో,ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యకు సంబంధించిన సూచనలు మరియు సలహాలు అందజేశారు.
అనంతరం పట్టణ పరిధిలో మునిరత్నం నగర్ స్కూల్ ను సందర్శించారు.స్కూల్ ఉపాధ్యాయులతో స్కూల్ మ్యాపింగ్ గురుంచి పలు సూచనలు అందజేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిధిలో ఉన్న పుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు. పుదురు స్కూల్ ప్రధానోపాధ్యాయునితో కలసి నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం విన్నమాల గ్రామంనందు ఉన్న పాఠశాలను సందర్శించారు. స్కూల్ మ్యాపింగ్ సంబంధించిన విషయాలను సంబంధిత ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లావిద్యాశాఖ అధికారులతోపాటు, మండలవిద్యాశాఖ అధికారి యన్. బాబు పైకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img