Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎంపికైన పాఠశాలల్లో నాడు నేడు

నెల్లూరు,జులై21:-ఎంపికైన పాఠశాలల్లో నాడు నేడు పనులు ముమ్మరంగా చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజశేఖర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం సాయంత్రం వారు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనబడి -నాడు నేడు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు త్వరగా సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. ప్రతి వారం సంబంధిత ఏజెన్సీల సహకారంతో తప్పనిసరిగా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. నాడు నేడు పనులకు అవసరమైన ఇసుక సిమెంటు తదితర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు వారి క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడుతూ జిల్లాలో నాడు నేడు కింద రెండో విడతలో 1323 పాఠశాలలు ఎంపిక అయ్యాయని అందులో 41 పాఠశాలలు ఈరోజు గురువారం కొత్తగా ఎంపిక అయ్యాయన్నారు. మరో 26 జూనియర్ కళాశాలలు కూడా ఎంపికయ్యాయన్నారు. జిల్లాకు తొలి దశలో 35 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా అందులో 98 శాతం నిధులు వినియోగించడం జరిగిందన్నారు. అధికారులు ఏజెన్సీల సమన్వయంతో పురోగతిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్, సమగ్ర శిక్ష ఎపిసి శ్రీమతి ఉషారాణి ,ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. శ్రీ వరప్రసాద్ సమగ్ర శిక్ష ఈఈ. శ్రీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img