విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం రైతు భరోసా కేంద్రం నందు రైతులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆత్మ ( జిల్లా వనరుల కేంద్రం) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి శివ నారాయణ మరియు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం నుండి డి విజయ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.రైతులతో శివ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులకు చిరుధాన్యాలు అయిన రాగులు ,సజ్జలు, కొర్రలు తక్కువ నీరుతో సాగు అవుతాయని అన్నారు కనుక రైతులు వాటిని సాగు చేసుకోవాలి సూచించారు అలాగే చిరుధాన్యాలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి వివరించారు. మిల్లెట్ సాగు కి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు మరియు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు కనుక ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు సాగు చేయాలి అని సూచించారు, కంది రకమైన ఎల్ఆర్ జీ 52 ప్రత్యామ్నాయంగా ఎల్ ఆర్ జీ 105 మరియు ఎల్ఆర్ జీ 133-33మరియు టీఆర్ జీ 59 రకాలను సాగు చేసుకోవాలని సూచించారు ఖరీఫ్ లో సాగు చేసుకునే కంది సెప్టెంబర్ నెల ఆఖరి లోపు సాగు చేసుకోవచ్చని తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం నుండి వచ్చిన డి విజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మిరపల ఆశించే తెగులకు అలాగే మిరపలో ఆశించే నల్ల తామర పురుగులకు నివారణ చర్యలు గురించి రైతులకు వివరించారు.ఆలాగే మినిము, శనగ పంటలో ఆశించే పురుగులు మరియు తెగులు నివారణ చర్యలు గురించి తెలిపారు.ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం గ్రామ సర్పంచ్ సాదు శ్రీలత,నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి మెంబర్ అనమొలు లక్ష్మి నరసింహం, వలేటివారిపాలెం గ్రామ ఉపసర్పంచ్ గురజాల కృష్ణయ్య ,రైతులు పరిటాల వీరస్వామి, పల్లాల వెంకటేశ్వర్లు, బొమ్మ రెడ్డి తిరుపతిరెడ్డి, మరియు రైతులు, వ్యవసాయ ఉద్యానవన సహాయకులు షేక్ .అల్తాఫ్,ఏ. సురేష్,ఇ.సురేష్,పి.నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.