Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కంకరలోడు టర్బోలారీ బోల్తా

విశాలాంధ్ర – గుడ్లూరు: కంకరలోడుతో వెళుతున్న టర్బోలారీ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండల కేంద్రమైన గుడ్లూరు సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోనికి వెళితే చీమకుర్తి గ్రానైట్ ప్రాంతం నుండి కంకరలోడుతో లారీ శాయిపేటకు బయలు దేరింది. కందుకూరు మీదుగా శాయిపేటకు వెళ్లే ప్రధాన రహదారి ఉండగా, దారి అవగాహన లేక తెట్టు వద్ద నుండి గుడ్లూరు మీదుగా వెళ్లేందుకు వస్తుండగా గుడ్లూరు సమీపములో బిల్డింగుల వద్ద ఉన్న చప్టాకు కొద్ది దూరంలో లారీ రోడ్డు మార్జిన్ దిగి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని వారికి ఎటువంటి ప్రమాదం జరుగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత రాత్రి నుండి వర్షం పడుతుండటంతో రోడ్డు మార్జిన్ లో దిగి లారీ అదుపుతప్పినట్టు తెలుస్తుంది…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img