Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విఆర్ న్యాయ కలశాల సమస్యలు పరిష్కారం లభించేది ఎప్పుడు?

విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు : నెల్లూరు జిల్లాకి తలమానికమైన వి. ఆర్ న్యాయ కళాశాలకి ఘనమైన చరిత్ర ఉంది.అలాంటి కళాశాలలో అనేకమంది అనేక ప్రాంతాల నుండి న్యాయ విద్యను అభ్యసించడానికి వస్తున్నారు అయితే ఈ కళాశాలలో అనేక సమస్యలు వెక్కిరిస్తున్నాయి పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారులు చూస్తుంటే సమస్యలు పరిష్కారం లభించేది ఎప్పటికీ అనేది విద్యార్థులందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న స్పెషల్ ఆఫీసర్  జాయింట్ కలెక్టర్ అయినటువంటి కూర్మనాద్  కి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు 2010 లో రిటైర్డ్ అయినటువంటి ఇన్చార్జి ప్రిన్సిపల్ పి.జయ చంద్రబాబు  ఇక్కడ నిత్య ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తూ జీతం  పెన్షన్ తీసుకుంటూ విద్యార్థుల మధ్య తరచుగా గ్రూపు రాజకీయాలు చేస్తూ విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నట్టు విద్యార్థులు జాయింట్ కలెక్టర్ కి తెలియజేశారు. రిక్రూట్మెంట్ లేకుండా ఇక్కడ సీనియర్ విద్యార్థిగా ఉంటూ ఆర్టిఐలువేసిదారానారాయణ అనే వ్యక్తి ఇక్కడ అడ్డదారిలో ఉద్యోగిగా చేరడం జరిగింది. కళాశాలలో దీక్ష చేస్తూ విద్యార్థుల్ని బెదిరిస్తూ మీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని విద్యార్థుల్ని బెదిరిస్తున్నారని తెలియజేశారు.కళాశాలలో బయట వ్యక్తులకు జీతాలు ఇస్తున్నారని విద్యార్థులు కట్టినటువంటి సొమ్ము వృధా చేస్తున్నారని జాయింట్ కలెక్టర్దగ్గరవాపోయారు.కళాశాలలో మూడు సంవత్సరాల మరియు ఐదు సంవత్సరాలకి ఎల్.ఎల్.బి కి ప్రత్యేకమైన హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ ఓ డి) లు నీ నియమించాలని విద్యార్థులు తెలియజేశారు.సీనియర్ విద్యార్థులకు నూతనంగా సిద్ధపరచినటువంటి మూట్ కోర్టు లో మూట్ కోర్టు ను జరిపించడం లేదని విద్యార్థులు జాయింట్ కలెక్టర్దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజశేఖర్ రెడ్డి,శ్రీకాంత్, కలాం, చంద్రశేఖర్, రుష్వంత్,సతీష్,నలిశెట్టి రాజశేఖర్,ఉపేంద్ర,శంకర తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img