( విశాలాంధ్ర) వత్సవాయి : ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని భీమవరం శివార్లలో చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన పాశం అప్పయ్య(42) గ్రామానికి ఎంపీ నిధులు ద్వారా పంచాయతీకి మంజూరైన వాటర్ ట్యాంకర్ రిజిస్ట్రేషన్ నిమిత్తం జగ్గయ్యపేట వెళ్లి వస్తుండగా భీమవరం గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్లడంతో డ్రైవర్ మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై అభిమన్యు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తుని చేపట్టారు… నిమిషాలు వ్యవధిలోని 108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని వత్సవాయి ఈఎంటి స్వర్ణకుమారి సి పి ఆర్ ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లుగా నిర్భరించారు…. దీనిపై సంబంధిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు… సిపిఆర్ ద్వారా బ్రతికే అవకాశం ఉంటుందేమోనని వత్సవాయి ఈఎంటి స్వర్ణకుమారి ప్రయత్నాన్ని ప్రజలుఅభినందించారు