నందిగామ నియోజకవర్గంలో అత్యధిక గ్రామాలు కలిగిన చందర్లపాడు మండల అనుసంధానం చేసే రోడ్డు చందర్లపాడు రోడ్డుగా పేరు పొందింది అటువంటి రోడ్డులో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో చందాపురం గ్రామం ముందు ఉన్న లో బ్రిడ్జి నానాటికి డ్యామేజ్ అవుతూ రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉందనేది ప్రస్తుత గ్రామస్తుల వాదన అక్కడ బ్రిడ్జి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది ఎన్నిసార్లు ఆర్ ఎం బి అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోవడం ఏం చేయాలో అర్థం కాకపోవడం తో గ్రామస్తులు ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు ఈ బ్రిడ్జి గతంలో లోసప్తగా ఉన్న సమయంలో చిన్న పాటి వర్షాలు వచ్చినా తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడి రాకపోకలకు అంతరాయం జరుగుతున్న నేపథ్యంలో గత 15 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులను బట్టి లో సప్ట ను సైతం బ్రిడ్జిగా మార్చారు కానీ తగినంత ఎత్తు లేపకపోవడం రోడ్లు పదేపదే ఎత్తు పెరగటం వలన మరోసారి చందాపురం బ్రిడ్జి లో బ్రిడ్జ్ గా మారిపోయింది ఇది గత ప్రభుత్వంలోనే కొద్దిగా డ్యామేజీ అయినను తాత్కాలిక మరమ్మత్తులు చేసి తూతూ మంత్రంగా ముగించారు కానీ ప్రస్తుతం ఆ బ్రిడ్జికి ఇరువైపులా డ్యామేజ్ ఏర్పడి బ్రిడ్జిలోని ఒక భాగంలో పూర్తిగా పొంగిపోయి గుంటను సైతం మనం ప్రస్తుతం చూసే పరిస్థితి వచ్చింది అర్ధరాత్రి అపరాత్రి వర్షం పడ్డ సమయంలో ఆ గుంటను చూడక అనేకమంది ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా లేకపోలేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ బ్రిడ్జి తీరును పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు ఒకవేళ బ్రిడ్జి మరలా తాత్కారక మరమ్మత్తులు లేదా పట్టించుకోని ఎడల ఏ క్షణమైనా బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అదే గనక జరిగితే చందర్లపాడు మండలంలోని కొన్ని గ్రామాలకు నందిగామతో సంబంధాలు తెగిపోతాయి అని చెప్పవచ్చు..