విశాలాంధ్ర- వత్సవాయి : వత్సవాయి మండల పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు
పోలంపల్లి గ్రామ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు మరియు యన్.టి.ఆర్. జిల్లా ఉపాద్యక్షులు
కిలారు విశ్వనాధ్ కుమార్ ఆద్వర్యంలో గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నందు సంగీభావ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెంరఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ సంఘీభావం తెలియజేసి, దీక్షలో కూర్చున్నటువంటి వారికి కండువాలు కప్పి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని రానున్న ఎన్నికల్లో ప్రజలే చంపపెట్టుగా తీర్పు చెప్పబోతున్నారని అన్నారు, రాష్ట్రంలో అభివృద్ధికి బదులు ప్రతీకారమే కనబడుతుందని మాజీ శాసనసభ్యులు తాతయ్య ఎద్దేవా చేశారు
ఈ దీక్షకు సంఘీభావంగా కొఠారు సత్యనారాయణ ప్రసాద్ వడ్లమూడి రాంబాబు కట్టా వెంకట నరసింహారావు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తిమల్లెల గాంధీ తొండపు జగన్మోహన్రావు పెద్ది రామారావు చిట్టూరి రమేష్ గుత్తా భద్రయ్య కట్టా వేణుకొఠారు రాంబాబు కిలారు సూర్యనారాయణఉప్పు గండ్ల రాధాకృష్ణ ఉయ్యూరి అప్పారావు కనగాల రమేష్ బొల్లం పురుషోత్తం హనుమంతరావు పెంట్యాల శ్రీనివాసరావు కనతాల రామకృష్ణ కిలారు తిరుపతిరావుకంభంపాటి పుల్లారావు పొదిల అప్పారావు పెంట్యాల శ్రీనుఊట్ల కర్నాటి రఘు ఏపూరి నాగ శ్రీను, జొన్నలగడ్డ కోటేశ్వరరావు, తోటకూరి వెంకటేశ్వరరావు నందమూరి శ్రీనివాసరావుఆదిమల్ల రమేష్ తమ్మినేని చలపతిరావు పల్లెబోయిన నాగరాజు మండేపూడి శ్రీనివాసరావు మహిళలు మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేశారు.