Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

తెలుగు తమ్ముళ్లు వినూత్న నిరసన

విశాలాంధ్ర – నందిగామ రూరల్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందిగామ మండలం పరిధిలోని ఏటిపట్టు గ్రామాల నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా నందిగామ మండల తెలుగుదేశం పార్టీఆద్యుక్షుడు వీరంకి వీరాస్వామిన్, ప్రధాన కార్యదర్శి తోట నాగమలేశ్వరావు(బుజ్జి) సంయుక్తంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని లేదంటే ఇంకా ప్రజా ఉద్యమం తీవ్రతరమవుతుందని ప్రభుత్వన్నీ హెచ్చరించారు. మీరు సంక్షేమం ముసుగులో దోచుకో దాచుకో తినుకో అని చేస్తున్న దోపిడీ విధానాన్ని ప్రజలకు వివరించి చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందుకు కావాలని కక్ష కట్టి మానాయుకుడుపై కేసుపేట్టారని, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా,15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా, యువతకు స్ఫూర్తిగా ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగుల ఉపాధి కల్పనకై స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సిమెన్సు కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని 3710 కోట్ల రూపాయలు సిమెన్స్ కంపెనీ ఇస్తే 371 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చి ఎంతో మంది యువతకు శిక్షణ ఇప్పించి తద్వారా వేల కుటుంబాల్లో ఉపాధి వెలుగులు నింపితే అది చూసి ఓర్చుకోలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీముల పేరుతో స్కాములు చేసే ఈ ప్రభుత్వ వక్రబుద్దిని ఉపయోగించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన స్కిల్ డెవలప్మెంట్ లో నిదులు దారి మళ్లించారని తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసి మచ్చలేని చంద్రుడిలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటించిన అవినీతి మరకలు కడుక్కొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల చేత మరలా ఎన్నిక కాబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాతగా నిలబడతాడని తెలియజేశారు. అవినీతి కేసుల్లో నాయకులు జైలుకు వెళ్లినప్పుడు బాధితులు బయటకు వచ్చి వారి గోడు వెళ్ళబోసుకోవడం చూసాం కానీ ఈరోజు నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళితే దేశ విదేశాల్లో ఐటీ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు మేము సైతం బాబు కోసం అంటూ రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు అంటే,ఆయన తెచ్చిన ఐటీ విప్లవం ఏ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడిందో ఈ అవినీతి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుచేసి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారనీ,ఇది ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వ పతనం తప్పదని, నువ్వు చేసిన అవినీతిని కక్కించి నువ్వు దోచుకున్న అవినీతి సొమ్ము వసూలు చేసి పేద ప్రజలకు మరలా మరింత సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అందించబోతుందని హెచ్చరించారు.బాబు కోసం మేము సైతం అంటూ మునేరు నీటిలో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెరుకూరు వాసుదేవరావు,ఉన్నం అప్పారావు,వేల్పుల బిక్షాలు, మన్నేపల్లి వినయ్ కుమార్, ఉమ్మనేని విక్రం,గర్మిడి సురేష్, అబ్బూరి వెంకటేశ్వరరావు, పల్లెపోగు నాగేశ్వరరావు, తాళ్లూరి చిన్న నరసింహారావు, చిట్లూరి మౌళేశ్వరరావు, సామినేని వీరప్రకాశరావు, కేశగాని వెంకటేశ్వర్లు (వెంకన్న), జవ్వాజి ప్రదీప్,వేజెండ్ల వెంకటేశ్వరరావు(శ్రీను), జిల్లేపల్లి పాపారావు,మువ్వ వీరాంజనేయులు (వీరయ్య), సామినేని వీరప్రకాశ్రావు, వడ్డెబోయిన నరసింహారావు, చిట్లూరి వెంకట్రావు,బిక్కీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img