మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ప్రభుత్వ ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి రోజున ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యమును కల్పించడం జరిగిందని, ఇందులో భాగంగా 288 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 28వ తేదీ బుధవారం కూడా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం సజావుగా జరిగిందని వారు తెలిపారు. కావున ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మొదటిరోజు పోస్టల్ బ్యాలెట్ లో 288 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు..
- Advertisement -
RELATED ARTICLES


