Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అంతులేని సంపద అంతుచిక్కని రహస్యం

చలసాని వెంకట రామారావు

తిరువాన్కూరు రాజవంశీకులు నిర్మించిన పద్మనాభస్వామి దేవాలయపు నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువచేసే సంపద నిక్షిప్తమైంది. ఇందులో కొంత లెక్కించగా లక్షలకోట్ల విలువైన వజ్రవైఢూర్యాలున్నాయనేది ఒకనాటి ఫ్యూడల్‌ వ్యవస్థలోని సంపద కథ. కానీ ఆధునిక భారతంలో కొద్ది సంవత్సరాలలోనే అంతులేని సంపదను అక్రమంగా కూడబెట్టిన అంతుచిక్కని రహస్యాన్ని ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ అమెరికా ఆధారిత పెట్టుబడి పరిశోధనా సంస్థ 2023 జనవరి 24న ఒక నివేదికను ప్రపంచం ముందు ఉంచింది. ఆశ్రిత పెట్టుబడీదారీ వర్గం సృష్టించిన అపరకుబేరుడు అదాని ఆర్థిక సామ్రాజ్య నిర్మాణంపై వెల్లడిరచిన నివేదిక ఇది.
హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ షార్టు సెల్లింగ్‌ షేర్‌లను అంచనావేసి తక్కువరేటు ఉన్నప్పుడు కొనుగోలుచేసి, ఎక్కువ ధరకు తిరిగి అమ్ముతూ లాభాలను గడిరచే సంస్థ. ఆర్థిక సంస్థల మోసాలను బైటపెట్టి పెద్దపెద్ద కంపెనీలను దివాళా తీయించిన చరిత్ర హిండెన్‌బర్గ్‌ సంస్థకు ఉంది. ఈ సంస్థ రెండు సంవత్సరాలపాటు పరిశోథనచేసి ప్రపంచ కుబేరులలో 3వ స్థానంలో ఉన్న అదాని ఆర్థిక మోసాలపై ఒక నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక వెలువడగానే అదాని ఆర్థిక సామ్రాజ్యం కకావికలమైంది. అదాని కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి మదుపర్ల లక్షల కోట్ల ధనం ఆవిరైపోయింది. అదాని కంపెనీల డొల్లతనం బైటపడిరది. అదాని కంపెనీల షేర్లు పెంచుకోవటానికి అనుసరించిన అక్రమ, అవినీతి పద్ధతులను ఈ నివేదిక వెల్లడిచేసింది. అదాని వివాదాలపుట్ట బద్దలై వీరి ఆర్థిక సామ్రాజ్యం ఒక పేకమేడలా కుప్పకూలటం ప్రారంభమైంది. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా 2.5 బిలియన్ల డాలర్లు ఫాలో ఆఫ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను జారీ చేయడానికి రెండు రోజుల ముందు ఈ నివేదిక రావటం విశేషం.
అదాని ఆర్థిక సామ్రాజ్యం ఒక అప్పులకుప్ప. స్టాక్‌ మార్కెట్‌లో మలేషియాలో తాము నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా తమ షేర్లను తామే ఎక్కువరేటుకు కొనుగోలుచేసి మార్కెట్‌లో కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించారు. దీనితో అదాని కంపెనీల షేర్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగి ఎక్కువ రేటుకు అమ్మకాలు చేశారు. ఈ రకంగా మదుపర్లను మోసం చేశారు. వాస్తవానికి అదాని కంపెనీలోని షేర్లలో 65 నుండి 73శాతం వరకు ప్రమోటర్లుగా ఉన్న అదాని కుటుంబసభ్యుల పేరుతో ఉన్నాయి. దీనితో ఎక్కువరేటు కొనుగోలు చేసిన ప్రయోజనాలు అన్నీ అదానీ కుటుంబానికే దక్కాయి. బయట ఓపెన్‌ మార్కెట్‌లో 10శాతం షేర్లు మాత్రమే ఉంచి సరఫరా తక్కువచేసి డిమాండ్‌ పెంచి తమ వద్ద ఉన్న 90శాతం షేర్లను ఎక్కువధరకు అమ్మడం ద్వారా తమ సంపదను పెంచుకున్నారు. లక్ష పెట్టుబడి పెడితే కృత్రిమ బూమ్‌ వలన దాని విలువ 20లక్షలకు పెరిగింది. దీనికితోడు రాజకీయ తోడ్పాటుకూడా అదాని అర్థికసామ్రాజ్య విస్తరణలో ప్రముఖపాత్ర వహించింది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదాని అర్థికసామ్రాజ్యం ఒక తారాజువ్వలా ఎగిసింది. భారీ కంపెనీలుగా విస్తరించాయి. అదాని గ్యాస్‌, అదాని ఎంటర్‌ప్రైజెస్‌, అదాని గ్రీన్‌, అదాని ట్రాన్స్‌మిషన్‌, అదాని పోర్ట్సు, అదాని పవర్‌ వంటి అనేక సంస్థలను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగాడు. అదాని బ్యాంకులు, బాండ్ల ద్వారా భారీగా అప్పులు చేశాడు. అదానీకి 2లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు భారీగా అదాని కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 81వేల కోట్లు, జీవిత బీమా సంస్థ 77వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్లోబలైజేషన్‌ ప్రక్రియ వేగవంతమై ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం పెరిగింది. అనేక ప్రభుత్వరంగ సంస్థలకు ప్రైవేటు పెట్టుబడిదార్ల పరం చేశారు. అంబాని, అదాని వంటి గుజరాత్‌ వ్యాపారులు మోదీ పాలనలో ఎన్నో ప్రయోజనాలు పొందారు. స్టాక్‌ మార్కెట్లను ప్రలోభపెట్టి అదానీ షేర్లను అనూహ్యంగా పెంచుకుంటూ వచ్చాడు. కరోనా కాలంలో సైతం దేశం సంక్షోభంలో ఉండి, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. ప్రపంచమంతా తీవ్ర ఒడిదుడుకులకులోనైనా అదానీ మాత్రం రోజుకు 1660 కోట్ల ఆదాయం పొందారు.
మోదీ ప్రభుత్వ సహకారం వల్ల ఎకౌంటింగ్‌ మెసాలకు అదాని పాల్పడ్దారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు ఎగనామం పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలలోని ప్రజలసొమ్ముతో వ్యాపారం చేశారు. మోదీ కరుణా కటాక్షాలతో పోర్టులు, విమానాశ్రయాలు, అదానీ చేతిలోకి వచ్చాయి. ఇంజినీరింగ్‌ కంపెనీలు, రైలు, రైల్వే స్టేషన్‌లు, ఫార్మా కంపెనీలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, రోడ్లు, నదులు, సముద్రాలు, భూగర్భ గనులు, పైప్‌ లైన్లు, కేబుళ్లు కారు చౌకగా అమ్మివేశారు. అదాని ప్రపంచ మూడవ ధనవంతునిగా కావటానికి అన్ని హంగులు మోదీ ప్రభుత్వం చేసింది. 2015 బంగ్లాదేశ్‌ విద్యుత్‌ ఒప్పందంలో ఆస్ట్రేలియా బొగ్గుగనుల కాంట్రాక్టులో, శ్రీలంక విద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందంలో, ఆరు కీలక విమానాశ్రయాల అప్పగింతలో, విదేశీ బొగ్గు కొనుగోలు ఉత్తర్వులు జారీలో, జీవితబీమా, ప్రభుత్వ రంగ బ్యాంకుల అప్పులలో కేంద్ర ప్రభుత్వ పాత్ర జగద్విదితమే. మోదీతో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం వల్లె ఇది సాధ్యమైంది. ముంబయిలోని జీవికె ఎయిర్‌పోర్టు, నవీముంబయి ఎయిర్‌పోర్టు వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర విమర్శలకు గురైంది.
అహ్మదాబాద్‌, లక్నో, జైపూర్‌, గౌహతి, బెంగుళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలతోపాటు 13 పోర్టులు అదాని పరం అయ్యాయి. మన రాష్ట్రానికి చెందిన గంగవరం, కృష్ణపట్నం పోర్టులు కూడా వీటిలో ఉన్నాయి. అంబుజా సిమెంట్‌లో 35కోట్ల విలువైన 63శాతం వాటా అదాని పరమైంది. విద్యుత్‌రంగం, సోలార్‌ విద్యుత్‌, రియల్‌ఎస్టేట్‌, బాస్మతిరైస్‌, వంటనూనెల రంగాలలో అదానీకి ఎదురులేని పరిస్థితి ఏర్పడిరిది. దేశంలో అతి పెద్ద బొగ్గు సరఫరా సంస్థ, అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌, పెద్ద గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, పెద్ద ధర్మల్‌ విద్యుత్‌సంస్థ అదాని చేతిలోనే ఉన్నాయి. 30కిపైగా కంపెనీలతో 2014 తరువాత అదానీ సామ్రాజ్యం విస్తరించింది. 8ఏళ్లలో ప్రపంచ ధనవంతులలో ఒకడిగా నిలిచాడు.
ఇంతటి పెద్ద ఆర్థిక కుంభకోణం బైటపడినప్పటికీ అదానీ ఆశ్రిత బంధువు, దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీగాని, దేశ విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌గాని ఈ విషయంలో స్పందించకుండా మౌనం దాల్చారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ డిమాండ్‌తో విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు పతనానికి దారితీసిన పరిస్థితులు, స్టాక్‌మార్కెట్‌ రెగ్యులేటరీ అంశాలపె ౖదర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని నియమించింది. మదుపర్ల రక్షణకు సైతం సిఫారసులు చేయాలని కోరింది. కమిటీ దర్యాప్తు అంశాలను ప్రజలకు వెల్లడిరచి దోషులను శిక్షించాలి.
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img