Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొనేనా?

ఎం.సి.వెంకటేశ్వర్లు

ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకోవలసిన కర్తవ్యం మోదీ ప్రభుత్వం ముందున్నది. మధ్యాసియా మొత్తంగా ఎదుర్కొంటున్న అస్థిర పరిస్థితులను ఎదుర్కోవాలన్నా, టెర్రరిస్టుల ప్రభావం నుండి భారత్‌ను, ఆసియా భద్రతను కాపాడుకోవాలన్నా చైనా, రష్యా, భారత్‌ మధ్య ఐక్యత మినహా మరో మార్గం లేదు.

అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడి నెల రోజులయినా ప్రపంచ వ్యాపితంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రభుత్వాన్ని గుర్తించడంలో చైనా, పాకిస్తాన్‌ పరోక్ష సంకేతాలిచ్చినాÑ రష్యా, భారతదేశం తటపటాయి స్తున్నాయి. యూరోపియన్‌ దేశాలు అమెరికా తీసుకున్న వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. శాంతి ఒప్పందంపై అమెరికా సంతకం చేసినా మౌనం పాటిస్తున్నది.
ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు గందరగోళంగా ఉన్నాయి. తాత్కా లిక మంత్రివర్గ కూర్పు అనేక వైరుధ్యాలతో కూడి ఉన్నది. అమెరికాను సాగ నంపడానికి భిన్నాభిప్రాయాలున్న ఉగ్రవాద సంస్థలన్నీ తాలిబన్ల కింద సమీకృత మయ్యారు. అమెరికా నిష్క్రమణ తరవాత ఆయా సంస్థల నిజస్వరూపం బయట పడిరది. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ప్రేరేపిత అల్‌ఖైదా, హక్కాని గ్రూపులుÑ ముజాహి దీన్లు, ఛాందసవాస మతమౌఢ్యులు తాలిబన్లు ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నారు. టెర్రరిస్టులుగా ముద్రపడి ఐక్యరాజ్యసమితిలో నిషేధిత లిస్టులో ఉన్న 14మంది మంత్రివర్గంలో ఉన్నట్లు వార్తలు. ప్రత్యేకించి తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఉన్న ముల్లా మహమ్మద్‌ హసన్‌ వారిలో ఒకరు. ఆంతరంగిక మంత్రిగా ఉన్న కరుడుగట్టిన, మతోన్మాద సంస్థ హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన వ్యక్తి సిరాజుద్దీన్‌ హక్కాని. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో శాంతిని నెలకొల్పగలుగుతుందా అన్నది ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య.
ఇటీవల షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ) ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్‌ సమావేశంలో భారత ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘‘అత్యాధునిక ఆయు ధాలు అఫ్గానిస్థాన్‌లో పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. అక్కడ తాజా పరిణామాల కారణంగా డ్రగ్స్‌, అక్రమ ఆయుధ వ్యాపారం, మానవ అక్రమ రవాణా నియంత్రించలేని విధంగా మారనున్నాయి. ఫలితంగా మధ్యాసియా మొత్తం అస్థిరత నెలకొనే ప్రమాదం ఉంది. ఆ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భారత్‌ వంటి పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని చెప్పారు. ఈ మాటలు తేలికగా కొట్టిపారేయవలసినవి కావు. మోదీ రాజకీయ నేపథ్యం, ఎన్‌డిఎ ప్రభుత్వ ఆర్థిక, పాలనా రాజకీయ విధానాలను మనం వ్యతిరేకించినప్పటికీ ఆయన చెప్పిన మాటలు మాత్రం యధార్థం.
వాస్తవానికి అఫ్గానిస్థాన్‌ ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యధిక ఇంధన వనరులున్న పశ్చిమాసియా, మధ్యాసియా, దక్షిణాసియా మధ్యలో ఈ దేశం ఉన్నది. ఆసియా దేశాలలో లక్షల కోట్ల విలువ చేసే ఇంధన, ఖనిజ నిక్షేపాలతో పాటు, సహజ వాయువు అపరిమితంగా నిక్షిప్తమై ఉంది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దున ఉన్న ఇరాన్‌ గుండా ఇరాక్‌, సిరియా, జోర్డాన్‌, లెబనాన్‌, ఇజ్రాయిల్‌ దేశాలకు చేరుకోవడానికి సులభంగా ఉంటుంది. పర్షియన్‌ గల్ఫ్‌ దాటితే చేరువలోనే అరేబియా ద్వీప కల్పం, ఇరాన్‌కు ఉత్తరాన చమురు, గ్యాస్‌ నిల్వలున్న కాస్పియన్‌ సముద్రం ఉన్నాయి. తూర్పు నుండి దక్షిణ సరిహద్దు వరకూ విస్తరించిన పాకిస్తాన్‌ భూభాగం ద్వారా ఇండియా సహా దక్షిణాసియా, హిందూ మహా సముద్ర ప్రాంతాలు దగ్గరవుతాయి. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకొన్న అమెరికా మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని కబళించడానికి ఎదురు చూస్తున్నది. పూర్వపు సోవియట్‌ యూని యన్‌, చైనా సోషలిస్టు దేశాలుండటం మధ్య ప్రాచ్య దేశాలైన ఈజిప్టు, ఇరాక్‌, సిరియా, ఉత్తరాఫ్రికాలోని లిబియాలలో అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రభుత్వాలుండటం, భారతదేశం తటస్థ దేశంగా ఉండటంతో అమెరికా పన్నా గాలు పారలేదు. ఆనాటి సోవియట్‌ యూనియన్‌ ఈ దేశాలన్నిటికి ఆర్థిక, రాజకీయ రంగాలలో పూర్తి మద్దతిచ్చింది. అందువలన పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొన్నప్పటికీ ప్రయోజనాలు నెరవేరలేదు.
సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలటంతో అంది వచ్చిన అవకాశాలన్నుప యోగించుకుని అఫ్గానిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని మధ్య ప్రాచ్య దేశాలు, అఫ్గా నిస్థాన్‌ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సైనికంగా ఓటమిపాలైనా అమెరికా, బ్రిటన్‌లు తాలిబన్లతో రాజీపడి ఆసియా ప్రాంతాన్ని ఉద్రిక్తతా కేంద్రంగా చేయడానికి మరో కుట్రకు అంకురార్పణ చేసిందనుటలో ఏ మాత్రం సందేహం లేదు. విదేశీ సహజ వనరులను దోపిడీ చేయడానికి, ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రులను సైతం బలి చేస్తుందనడానికి అఫ్గాన్‌ ఉదంతం తాజా ఉదాహరణ.
ఒక పక్క అమెరికాకు రాజకీయ, సైనిక వ్యూహాత్మక భాగంగా భారతదేశం మారడంతో చైనా, శ్రీలంక తదితర పొరుగు దేశాలన్నింటికీ మింగుడు పడటం లేదు. మరోపక్క అమెరికాను నమ్ముకొని అఫ్గానిస్థాన్‌లో తలదూర్చిన భారత దేశానికి అఫ్గాన్‌ పరిణామాలు తలనొప్పిగా తయారయ్యాయి. రెండు దశా బ్దాలలో కొత్తగా దాయిష్‌, ఐఎస్‌ఐఎస్‌కె, అల్‌ ఖాయిదా, లష్కర్‌ ఇ మహమ్మద్‌, లష్కర్‌ ఇ తోయిబా, ఐటిఐఎంకె శాజింజియాంగ్‌ రాష్ట్రం ఉగర్‌ ఉగ్రవాదులు, పిదాయీస్‌ లాంటి 20 నూతన టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చాయి. వీటికి చెందిన 5,000ల నుండి 30,000 వరకు టెర్రరిస్టులు అఫ్గాన్‌ చేరారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సందర్భంలో అమెరికా సేనల ఉపసంహరణకు కుదిరిన ఒప్పందంలో ప్రముఖ పాత్ర వహించిన, మోడరేట్‌గా పేరుపడ్డ అబ్దుల్‌ ఘని బరాదర్‌ను కాదని ముల్లా మహమ్మద్‌ హసన్‌ అకుంద్‌ను ప్రధానిగా చేయ డంలో పాకిస్థాన్‌ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. బరాదర్‌ను హత్య చేయ డానికి హక్కాని ముఠా ప్రయత్నించినట్లు, ఆయన కాబూల్‌ వదిలి కాంద హార్‌కు వెళ్లినట్లు వస్తున్న వార్తలు అఫ్గానిస్థాన్‌ అస్థిర పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ‘‘అఫ్గాన్‌ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. దానిలో అమెరికా తాలిబన్లకు మిత్రు నిగా ఉంటుందని’’ ఫ్రెంచి ఇన్‌స్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ స్ట్రాటజిక్‌ రిలేషన్‌ (ఐరి స్‌)కు చెందిన కరింఎక్సాడి చెప్పిన విషయం అఫ్గానిస్థాన్‌ భవిష్యత్‌కు సంకేతం.
ప్రపంచం నెత్తిమీద యుద్ధమనే పెద్ద భూతం వేలాడుతున్నదని ప్రపంచ రాజకీయ పరిణామాల విశ్లేషకుల అంచనా. ఇది వాస్తవం కూడా. దీనికి ఆధారం ఇస్లామిస్ట్‌ పరిధి క్రమంగా పెరుగుతున్నది. ఆఫ్రికాలో బోకోహరం, పాలస్తీనా మిలిటెంట్‌లు, ఒట్టోమిన్‌ సామ్రాజ్య విస్తరణకు టర్కీ అధ్యక్షుడు కంటున్న కలలు, జార్జియాని షింకిసి జార్జియాగా నిర్మించాలని ఇస్లామిస్ట్‌లు, ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టులు, చైనాలోని ఉగర్‌ మిలిటెంట్‌లు, యూరప్‌లో తలెత్తు తున్న ఇస్లామిస్ట్‌లు, తాజాగా అఫ్గానిస్థాన్‌ పరిణమాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రపం చవ్యాప్తంగా టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న దోపిడీదారీ విధానాలే ఈ పరిస్థితికి కారణమనుటలో సందేహం లేదు. అమెరికా తనకు ఎదురు దెబ్బలు తగిలినపుడే టెర్రరిజం వ్యతిరేక పోరాటాన్ని ఆయుధంగా చేసుకుని భారతదేశం లాంటి వర్థమాన దేశాలను బలి పశువులు చేస్తున్నది.
ప్రపంచ వ్యాపితంగా విస్తరిస్తున్న ఉగ్రవాదుల బెడద, అఫ్గానిస్థాన్‌లో ఆహారం కోసం, మందుల కోసం అల్లాడుతున్న ప్రజలు Ñ నిరుద్యోగం, పేద రికంలో తల్లడిల్లుతున్న జనాన్ని గాలికి ఒదిలి అధికారం కోసం ఒకర్ని ఒకరు చంపుకోడానికి సిద్ధపడ్డ తాత్కాలిక ప్రభుత్వ పాలకుల పాలనలో శాంతిస్థాపన జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకోవలసిన కర్తవ్యం మోదీ ప్రభుత్వం ముందున్నది. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ రాజకీయాలను తన చేతిలోకి తీసుకోవాలని తాలిబన్లను పక్కనబెట్టి అల్‌ఖైదా, హక్కాని ముఠాలకు వత్తాసు పలుకుతున్నది. బరాదర్‌ను ప్రక్కన పెట్టడంలో పాకిస్థాన్‌ కీలక పాత్ర వహించిందని అంతర్జాతీయ పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి ప్రధాని మోదీ చెప్పినట్లు మధ్యాసియా మొత్తంగా ఎదుర్కొంటున్న అస్థిర పరిస్థితులను ఎదుర్కోవాలన్నా, టెర్రరిస్టుల ప్రభావం నుండి భారత్‌ను, ఆసియా భద్రతను కాపాడుకోవాలన్నా చైనా, రష్యా, భారత్‌ మధ్య ఐక్యత మినహా మరో మార్గం లేదు. చైనా, భారత్‌ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు` పరిష్కారానికి యుద్ధం కాదు. చర్చలే ముఖ్యం. ‘‘అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌’’ ల చతుర్భజ కూటమి ఆసియాలో చిచ్చు పెట్టటానికే ఉపయోగపడుతుంది తప్ప శాంతి స్థాపనకు కాదు. అమెరికాతో ప్రయాణం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన సామెత అవుతుంది. మోదీ ఈ వాస్తవాన్ని గ్రహించగలిగితే భారత దేశానికి మేలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img