Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

అభివృద్ధి ఎండమావే…!

భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం దాదాపు మృగ్యమైనట్లే కనపడుతోంది. మన దేశంలో పసిబిడ్డ తల్లి రెండు రోజులుగా ఆకలితో నిర్వేదంగా రోజులు గడపడం సర్వ సాధారణం. పిల్లలకు కనీస ఆహారం లభించే గ్యారంటీలేదు. మరో పక్క దేశీయంగా నిరుద్యోగం 3.2శాతం తగ్గిందని పీరియాడిక్‌ లేబర్‌ సర్వే తెలిపింది. 2014`2023 మధ్య 125మిలియన్‌ ఉద్యోగాలు కల్పించినట్లు ఆర్థికమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమైన విషయం. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత 9.2 శాతమని సీఎమ్‌ఐఈ తెలిపింది. ఐఎల్‌ఓ తన తాజా నివేదికలో నిరుద్యోగులలో 83 శాతం మంది యువకులని పేర్కొంది. తాజాగా యూపీలోని పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో 60,244 ఖాళీల కోసం 16 లక్షలమంది మహిళలు సహా 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. యూపీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 7,500 ఖాళీలకు 24,74,030 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కేవలం మచ్చు తునకలే. మోదీ హయాంలో భారతదేశం ఆర్థికశక్తిగా మారుతుందన్న బీజేపీి ప్రభుత్వ ప్రచారం వట్టిబూటకమని రుజువైంది. అభివృద్ధి ప్రచారం ఎండమావిగా ఉంది.
ఈ ఏడాది జూలై 31న విడుదలచేసిన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశ ప్రధాన రంగాల ఉత్పత్తి వృద్ధి జూన్‌లో 4 శాతానికి క్షీణించిందని పేర్కొంది. కాగా ఇది 20 నెలల్లో మరింత నెమ్మదించింది. ఈ ఏడాది మే నుంచి ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధి 2.4 శాతానికి పడిపోయింది. బొగ్గు మినహా వివిధ రంగాలు ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తి వృద్ధిలో తీవ్ర క్షీణతను నమోదు చేశాయి. ఉక్కు ఉత్పత్తి ఏడు నెలల కనిష్టానికి దిగజారింది. చమురుశుద్ధి ఉత్పత్తి ఐదునెలల్లో మొదటిసారి క్షీణించింది. విద్యుత్‌ ఉత్పత్తి నాలుగు నెలల కనిష్ట స్థాయి 7.7 శాతానికి దిగజారింది. సహజవాయువు ఉత్పత్తి 13 నెలల కనిష్టానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతానికి పైగా ఉన్న కోర్‌ ఇండస్ట్రీస్‌ ఇండెక్స్‌ మే స్థాయి కంటే 3.2 శాతం తక్కువగా ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలలో ప్రభుత్వ వ్యయం, నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రపంచ పారిశ్రామిక ఉత్పాదక శక్తిగా దేశాన్ని కీలకస్థానంలో నిలపడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి. మోదీ 10సంవత్సరాల పాలనలో దేశం పారిశ్రామిక, ఉత్పాదకతకు దారితీయలేదు సరికదా, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం – మేక్‌ ఇన్‌ ఇండియా ప్రచారం వంటి పథకాలు ప్రారంభానికికూడా నోచుకోలేదు.
దీర్ఘకాలికంగా దేశంలో వేళ్లూనుకునిఉన్న పేదరికం తగ్గింపు, నియంత్రణకు వృద్ధి కచ్చితంగా అవసరం. సరళీకరణ ఆర్ధిక విధానాల అమలు అనంతర కాలంలో దేశంలో నెలకొన్న పేదరికాన్ని తగ్గించే విషయంలో కేవలం ఉత్పాదకత ఒక్కటే సరిపోదు. వివిధ రంగాలను వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చేయవలసి ఉంది. ముఖ్యంగా అభివృద్ధి అత్యధికంగా ఉండే పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండకూడదు. ఆర్థిక అభివృద్ధి దీర్ఘకాలిక ప్రక్రియ వృద్ధిగా మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకతో కూడినదై ఉండాలి. దీని ద్వారా కార్మికులు ఉత్పాదక రంగంతోపాటు ముఖ్యంగా వ్యవసాయం నుండి తయారీ, సేవా రంగాలకు విస్తరిస్తారు. సామాజిక భద్రత, విధానాలు పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మెరుగైన ప్రజా సేవలు పేదలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. వినియోగదారు వ్యయం, తలసరి ఆదాయం, వార్షిక వృద్ధి రేటు ఆధారంగా పేదరికం వృద్ధిని గణించవచ్చు. 2004-2012 కాలంలో తలసరి వృద్ధిరేటు అధికంగా కాగా, పేదరికం తగ్గుదల మరింతగా పెరిగింది. గత దశాబ్దకాలంగా, తలసరి వృద్ధి రేటు ప్రజలలో పెరుగుతున్న దారిద్య్రానికి దారితీస్తోంది.
పేదరికం తగ్గింపుకు సంబంధించినంతవరకు గత దశాబ్దంలోనే కాదు, అంతకుముందు దశాబ్దాలలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద పజిల్‌. 1991లో ఆర్థిక సరళీకరణ విధానాలతో మనదేశం వృద్ధి పథంలో నిలిచింది. మూడు దశాబ్దాల కాలంలో వృద్ధిరేటు మందగించడంతో ఆర్థిక వృద్ధి రేటుపై గణనీయంమైన ప్రభాం చూపింది. దేశ జీడీపీలో తయారీ రంగ వాటా పరిణామంలో చెప్పుకోదగిన మార్పు లేదు. వాస్తవంగా, భారతదేశంలో నిర్మాణాత్మక మార్పులకు సేవా రంగం కీలకం. సేవారంగం గత దశాబ్ద కాలంలో తన వాటాను దాదాపు 50 శాతానికి పెంచింది. అయితే తయారీ రంగం ప్రస్తుతం చాలా నిర్వేదంగా ఉంది. ఒక పక్క వేగంగా పెరుగుతున్న పేదరికం, వృద్ధిలో కొనసాగుతున్న పతనం, నిరుద్యోగితతోపాటు నిత్యావసరాల ధరల భారీ పెరుగుదలతో ముడిపడి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత రంగం స్తబ్దత మరింత ప్రభావం చూపనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img