Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఆధునిక విజయవాడ రూపశిల్పి టి.వి.

మహబూబ్‌ ఆజెం

మేయర్‌గా ఉన్న కాలంలో సాంఫీుక సంస్థలకు విస్తృత అధికారాలు, తగినంత ఆర్థిక వనరులు ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగు తామని భావించిన ఆయన రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు చేసిన కృషి, ప్రయత్నం ఎనలేనివి. స్థానిక సంస్థలకు విస్తృతాధికారాలు కావాలంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మునిసిపల్‌ చట్టాలకు సంబంధించిన 680 సెక్షన్లు ఆయనకు కరతలామలకం. అందుకే టి.వి.ని కదిలే మునిసిపల్‌ చట్టంగా ఆయన అభిమానులు, ప్రభుత్వ అధికారులు పిలుస్తూండేవారు. ఆయన పదవిలో ఉన్నా లేక పోయినా ఎంతోమంది స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌ పర్సన్లు తమకు వచ్చే సందేహాలను ఆయన్ను అడిగి నివృత్తి చేసుకునేవారు.

ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన పాతతరం రాజకీయ నాయకుల్లో టి.వి. ఒకరు. నిర్థిష్టమైన సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రజలను సంఘటితం చేశారు. ఆధునిక విజయవాడ నగర రూపశిల్పి, స్థానిక సంస్థల హక్కుల ఉద్యమ నేత, కమ్యూనిస్టు యోధ. టి.వి., టి. వెంకటేశ్వరరావుగా అందరికీ సుపరిచితులైన తాడిపనేని వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా చముళ్ళమూడి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1916లో డిశంబరు 12న జన్మించారు. తెనాలిలో 10వ తరగతి వరకూ చదివిన ఆయన డిగ్రీ ఏసీ కాలేజీలో పూర్తి చేశారు. కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు, మాకినేని బవపున్నయ్య, వేములపల్లి శ్రీకృష్ణ, వై.వి.కృష్ణారావుల పరిచయంతో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఆయన 1938లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గుంటూరులో 1939లో రైల్వే కార్మిక యూనియన్‌ ఆర్గనైజర్‌గా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 1940లో విజయవాడ వచ్చి రైల్వే, సిమెంట్‌ కార్మికుల యూనియన్‌, ఇతర ప్రజా సంఘాలలో పార్టీ హోల్‌టైమర్‌గా ఆయన అనేక కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 194647 తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయుధ సేకరణకు నిధులు వసూలు తదితర రూపాల్లో సహాయం అందించారు. 194748 మధ్య రహస్య జీవితం గడిపారు. ఆ తరవాత అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు, డిటెన్యూ ఖైదీగా కడలూరు సెంట్రల్‌ జైలుకు తరలించగా ఆ మూడు సంవత్సరాలు జైలు కమిటీ బాధ్యుడిగా బాధ్యతలు నిర్వహించి 1951లో విముక్తి పొందారు. ఆ తరవాత జరిగిన పట్టణ పాలక సంఘం ఎన్నికల్లో రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1958`59లో వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అప్పుడు డాక్టర్‌ జంధ్యాల దక్షిణా మూర్తి ఛైర్మన్‌గా ఉండేవారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత సీపీఐ విజయవాడ నగర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, నగర పార్టీ బలోపేతానికి అవిరళ కృషి చేశారు. 1967లో పార్టీ నిర్ణయంతో విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్‌ మేనేజరుగా నియమితులై 26 సంవత్సరాల పాటు విశాలాంధ్ర భవన పునర్నిర్నాణం, ప్రచురణాలయం విస్తరణ, బ్రాంచీల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వాటి అమలుకు అశేష కృషి చేశారు.
1981లో విజయవాడ పురపాలక సంఘం నగర పాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ కాగా ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 31వ డివిజన్‌ నుండి అత్యధిక మెజార్టీ ఓట్లతో ఎన్నికై విజయవాడ నగర పాలక సంస్థకు తొలి మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టి.వి. నాయకత్వంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి 44 డివిజన్‌లకు పోటీ చేయగా 32 డివిజన్లలో ఘన విజయం సాధిం చారు. ఆ తరవాత 1995లో మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా టి.వి. అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి మేయర్‌ పదవి అలంకరించారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న కామ్రేడ్‌ సుబ్బరాజుతో కలిసి మేయర్‌గా టి.వి. కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగడంతో నగర రూపురేఖలు మారిపోయాయి. ప్రధానంగా పేదలు నివశించే కొండలు, మురికి వాడలకు కనీసం మౌలిక సదుపాయాల కల్పన (రోడ్డు, డ్రైనేజి, మంచినీళ్ళు) కు విశేష కృషి చేశారు. అంతగా ఉపయోగపడని, విజయవాడ ఊరు మధ్యలో ఉన్న సత్య నారాయణపురం రైల్వేట్రాక్‌ తొలగింపు, కృష్ణాతీరాన 50 అడుగుల ఎత్తు గల భారత స్వాతంత్య్ర సంగ్రామ దృశ్య సదనం, గాంధీ కొండ అభివృద్ధి, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో విఎంసి కాంప్లెక్సుల నిర్మాణం, వాటి వల్ల ఆదాయం, కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు కార్ల్‌మార్క్స్‌, ఫెడరిక్‌ ఏంగెల్స్‌, వి.ఐ.లెనిన్‌ల కాంశ్య విగ్రహాల ప్రతిష్ఠాపన, తారాపేట, గవర్నర్‌ పేట ముస్లిం స్శశాన వాటికలను పునఃప్రారంభించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మొత్తంగా ఆధునిక విజయవాడ నగర రూపశిల్పి అనిపించుకున్నారు.
మేయర్‌గా ఉన్న కాలంలో సాంఫీుక సంస్థలకు విస్తృత అధికారాలు, తగినంత ఆర్థిక వనరులు ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగు తామని భావించిన ఆయన రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు చేసిన కృషి, ప్రయత్నం ఎనలేనివి. స్థానిక సంస్థలకు విస్తృతాధికారాలు కావాలంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మునిసిపల్‌ చట్టాలకు సంబంధించిన 680 సెక్షన్లు ఆయనకు కరతలామలకం. అందుకే టి.వి.ని కదిలే మునిసిపల్‌ చట్టంగా ఆయన అభి మానులు, ప్రభుత్వ అధికారులు పిలుస్తూండేవారు. ఆయన పదవిలో ఉన్నా లేక పోయినా ఎంతోమంది స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌ పర్సన్లు తమకు వచ్చే సందే హాలను ఆయన్ను అడిగి నివృత్తి చేసుకునేవారు. మునిసిపల్‌ పరిపాలన గురించి ప్రజా ప్రతినిధులకు తెలియజేసేందుకు ఆయన ఎ.పి.మునిసిపల్‌ కార్పొరేషన్‌ల కరదీపిక అనే గ్రంథాన్ని రాసి అందరికీ అందుబాటులో ఉంచారు. ఆయన మేయర్‌గా ఉన్నప్పుడు రాష్ట్ర పురపాలిక శాఖా మంత్రిగా శ్రీమతి సరోజినీ పుల్లారెడ్డి ఉండేవారు. నిధులు, విధులు రాబట్టే విషయంలో కొరకరాని కొయ్యగా తయరయ్యారని టి.వి. గురించి స్వయంగా ఆమె చెబుతుండేవారు. సోవియట్‌ యూనియన్‌, జర్మనీ, నేపాల్‌, శ్రీలంక దేశాలు సందర్శించారు.
వైరల్‌ ఫీవర్‌తో తీవ్ర అస్వస్థతకు గురై 97 సంవత్సరాల వయస్సులో 2013లో అక్టోబరు 14వ తేదీన మరణించారు. వారి కళ్ళు స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు, భౌతికకాయాన్ని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి వారి అభీష్టం మేరకు అప్పగించారు.
(నేడు టి.వి. వర్థంతి)
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్టు, 9959498786

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img