Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఆర్థిక వ్యత్యాసాలతో దుర్భర స్థితిలో పేదలు

బొల్లిముంత సాంబశివరావు

పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే జాతీయ ఆహార భద్రత చట్టం అమలులోకి వచ్చి 54 సంవత్సరాలైనా ఆకలి చావులను దేశంలో ఆపలేక పోయింది. ఆకలి చావులను ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015-18లో దేశవ్యాపితంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ 2015 నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని 13 జిల్లా ల్లోని 38% గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణించారని సర్వే బయటపెట్టింది. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావని, అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్పి తన బాధ్యత నుంచి తప్పించుకుంది.


దేశంలో గ్రామీణ, పట్టణ పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉపాధి కరవై వచ్చే ఆదాయం వారిని అపహాస్యం చేస్తున్నది. రెక్కల కష్టంతో కడుపులోకి గంజి పోసుకుందామన్నా పని కల్పించలేని పాలకుల విధానాల ఫలితంగా లక్షలాది ప్రజలు పారేసిన ఇస్తరాకులలోని ఎంగిలి మెతు కుల కోసం ఆరాటపడుతూ, ఎండకు ఎండి, వానకు తడిసి, మట్టికొట్టుకున్న చింపిరి బట్టలతో పుట్‌పాత్‌పైన జీవశ్చవాల్లా బతుకుతున్నారు. సరైన పోషకాహారం లభించక కోట్లాది మంది పిల్లలు, మధ్యవయసువారు, పెద్దలు రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరొకవైపున కొద్ది మంది సర్వభోగాలు అనుభవిస్తున్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారణం, కారకులు ఎవరు? పాలక ప్రభుత్వాల ఆర్థిక, రాజకీయ విధానాలు.. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడమే ఈ దుస్థితికి కారణం. భారత పాలకులు ఎప్పుడూ సంపద కేంద్రీకృత విధానాలనే అమలు జరు పుతూ వస్తున్నారు. ఫలితంగా కొద్దిమంది వ్యక్తులకు దేశ సహజ వనరుల న్నింటినీ పాలకులు కట్టబెడుతున్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలతో వేగం పుంజుకున్న ఈ పరిస్థితి నేడు మోదీ నాయకత్వాన ఎన్డీఏ పాలనలో ఉన్నత స్థాయికి చేరి ప్రజా ఆస్తులు, సంస్థలు బడా పెట్టుబడిదారుల వశమౌతు న్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు మరింత తీవ్రమైనాయి.
దేశ జనాభాలో ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నవర్గం 2014-15 లెక్కల ప్రకారం జాతీయ ఆదాయంలో 21.3% సొంతం చేసుకుంది. గత 30 సంవత్సరాల్లో అగ్రశ్రేణి ఆదాయాల వాటాలో భారతదేశం అత్యధిక పెరుగుదల నమోదు చేసింది. ఆర్థికంగా పైస్థాయిలో ఉన్న 10% మంది వాటా 1980-2016 మధ్య 31 నుండి 56% పెరిగింది. అమెరికా, చైనాల తర్వాత అత్యధిక సంఖ్యలో శత కోటీశ్వరులు ఇండియాలోనే ఉన్నారు. భారత దేశంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలున్నాయని ప్యారిస్‌లోని అధ్యయన సంస్థ (వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌) 2022 నివేదిక వెల్లడిరచింది. 2021లో భారత సమాజంలోని 10% అగ్రశ్రేణి సంపన్నవర్గం జాతీయ ఆదాయంలో 57%, అందులోని ఒక శాతం అగ్రధనికవర్గం 22% సొంతం చేసుకుంది. 1980 నుంచి భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక వెల్లడిరచింది. ఇండియాలో ప్రైవేట్‌ వ్యక్తుల సంపద 1980లో 290% ఉంటే 2020 నాటికి 560% కి పెరిగింది.
మరొకవైపున అత్యంత పేదలు ఉన్న దేశాల్లో భారతవాటా ఎక్కువ ఉంది. ప్రపంచవ్యాపితంగా అత్యంత పేదరికంలో ఉన్న జనాభా 68.9 కోట్లు ఉండగా అందులో భారతదేశం వాటా 20.17% ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధ ఆకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రతపై 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు.
2018 ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) మేరకు 119 దేశాల్లో భారత్‌ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్‌ 76 స్థానంలో ఉంది. ఈ విషయంలో ఘనా, బొలీవియా కన్నా వెనకబడి ఉంది. పోషక ఆహారంలోపం వలన 17.3% చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువమందిలో రక్తహీనత ఏర్పడిరది. చిన్నపిల్లల నుంచి బాల బాలికలు, గర్భిణుల్లో అధికంగా రక్తహీనత ఉంది. పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే జాతీయ ఆహార భద్రత చట్టం అమలులోకి వచ్చి 54 సంవత్సరాలైనా ఆకలి చావులను దేశంలో ఆపలేకపోయింది. ఆకలి చావు లను ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015-18లో దేశవ్యాపితంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణిం చారు. స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ 2015 నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని 13 జిల్లా ల్లోని 38% గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణించారని సర్వే బయటపెట్టింది. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావని, అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్పి తన బాధ్యత నుంచి తప్పించుకుంది. ఆకలి చావులపై సుప్రీంకోర్టుకు కూడా ఇదే నివేదిక ఇచ్చింది. ఆనారోగ్యానికి కారణం పోషక విలువలు లేని ఆహారమే కదా! దాని ఫలితంగా రోగ నిరోధకశక్తి తగ్గి పేదలు ప్రాణాలు కోల్పోతున్నారుగా. ఇది కూడా ఆకలి చావు కిందకే వస్తుంది. పేదరికానికి, అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు వారి దుర్భరమైన ఆర్థిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని అవే రుజువు చేశాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే గ్రామీణ పేదలకు సేద్యపు భూమి పంపిణీ చేయాలి. వారికి ఈ హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గవేతనం ఇవ్వాలి. వారికి వాటిల్లో భాగస్వామ్యం కల్పిం చాలి. ఇందుకోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి.
వ్యాస రచయిత సెల్‌ 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img