Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఆలోచన నైపుణ్యాలను హరిస్తున్న ఛాట్‌ జిపిటీ !

మైక్రోసాఫ్ట్‌ నవంబర్‌-2022లో ప్రవేశపెట్టిన ‘‘ఛాట్‌ జిపిటీ (ఛాట్‌ జనరేటెడ్‌ ఫ్రీ-ట్రెయిన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌)’’ యాప్‌ ‘‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’’ అవుతున్నది. ప్రవేశపెట్టిన తొలి ఐదురోజుల్లోనే ఛాట్‌ జిపిటీ యాప్‌ వినియోగదారులు ఒక మిలియన్‌కు చేరుకున్నారు. విద్యావేత్తలు ఇలాంటి కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత యాప్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మోడల్‌ ప్రస్తుత విద్యా వ్యవస్థను, గూగుల్‌ సర్చ్‌ యాప్‌ వ్యాపారాన్ని నిర్వీర్యం చేయవచ్చని వాపోతున్నారు. మన విద్యార్థుల్లో ఆలోచనాశక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యాలపై ముప్పేటదాడిగా ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో గణితపాఠాలు బోధించే ఉపాధ్యాయులు 1 నుంచి 20 టేబుల్స్‌ కంఠస్థం చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, నేర్చుకున్న పిల్లలు సగర్వంగా ఫీల్‌కావడం మనకు అనుభవం. తరువాత కాలిక్యులేటర్‌ కనిపెట్టడంతో పిల్లల్లో గణిత టేబుల్స్‌ నేర్చుకోవలసిన అవసరం తగ్గిపోయింది. శాస్త్రసాంకేతిక వృద్ధితోపాటు విద్యార్థులకు పరీక్షల నిర్వహణ పద్ధతుల్లోకూడా మార్పులు వచ్చాయి. అనంతరం అంతర్జాల సహాయంతో గూగుల్‌ సర్చ్‌ విప్లవం కాలిక్యులేటర్‌ను పక్కకుతోస్తూ ఉప్పెనలా మన ముందుకు వచ్చింది. గూగుల్‌సర్చ్‌ రావడంలో యువతలో చదవడం, నేర్చుకోవడం అనే అలవాటు తప్పిపోతున్నది. గూగులమ్మ ఒడిలో చేరిన యువత పుణ్యాన ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలషాపుల్లో గిరాకీ తగ్గడం, బుక్‌స్టోర్స్‌ మూతపడడం చూసాం. ఇంటర్నెట్‌ విప్లవంతో సమాజంలో చదవడానికి నూతన గూగులమ్మ తలుపులు తెరుచుకున్నాయి. ప్రతిచిన్న విషయ పరిజ్ఞానానికి స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో గూగుల్‌సైట్‌ తెరవడం చిన్న పిల్లలకు కూడా అలవాటైంది.
యూయస్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్ష నెగ్గిన ఛాట్‌ జిపిటీ:
యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌(యూయస్‌యంయల్‌ఈ) నిర్వహించిన పరీక్షలో ఛాట్‌ జిపిటీ యాప్‌ 60 శాతానికి పైగా మార్కులతో నెగ్గడం(52.4 శాతం నుంచి 75.0 శాతం) ఆశ్చర్యంగా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో అత్యంత కఠిన, ప్రమాణాలతో కూడిన పరీక్షగా యూయస్‌యంయల్‌ఈకి పేరుంది. ఈ పరీక్షలో స్టెప్‌-1, 2సికె, 3 లాంటి దశలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగ్గినవారికి మాత్రమే అమెరికాలో మెడికల్‌ లైసెన్సులు ఇస్తారు. మెడికల్‌ విద్యార్థులు, ఫిజీషియన్ల విషయ పరిజ్ఞానాన్ని (బయోకెమిస్ట్రీ, డయగ్నాసిస్‌, బయోఎథిక్స్‌ లాంటి మెడికల్‌ రంగాల్లో) తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడుతున్నాయి.
విద్యార్థుల్లో గూగుల్‌సర్చ్‌తో కాపీ, పేస్ట్‌ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్ష విధానాల్లో మార్పులు అనివార్యం అయ్యాయి. ఆన్‌లైన్‌ పరీక్షలతో సంప్రదాయకంగా రాసే కళ అడుగంటింది. ప్రశ్నాపత్రంలో ఇవ్వబడిన పేరాను చదివి దానిలో దాగిన సమాధానాలను వెతికి రాయమని అంటున్నారు. ఈ విచిత్ర సంధి కాలంలో నేడు ‘‘ఛాట్‌ జిపిటీ’’ యుగం వేగంగా దూసుకువచ్చింది. ‘కృత్రిమ మేధ’ ఆధారిత ‘ఛాట్‌ జిపిటీ’ ద్వారా మానవ స్పందనల వలె సమాధానాలు క్షణాల్లో వస్తున్నాయి. సంక్లిష్ట ప్రశ్నలకు సహితం క్షణాల్లో సరైన సమాధానాల స్పందనలు కనబడుతున్నాయి. గూగుల్‌సర్చ్‌తో వెబ్‌పేజీల్లో అడిగిన సమాచారం అందుబాటులోకి వచ్చింది. నేడు ‘ఛాట్‌ జిపిటీ’ యాప్‌ ద్వారా అడిగిన ప్రశ్నకు నిపుణులు ఇచ్చే సమాధానాల వలె ఖచ్చితమైన పరిశోధనాత్మక సమాధానాలు కళ్లముందు కనబడుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గూగుల్‌ కూడా ‘‘బార్డ్‌(బిఏఆర్‌డి)’’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో చైనా కూడా ‘‘బైడూ’’ అనే యాప్‌కు రూపకల్పన చేస్తున్నది.
ఈ యాప్‌ ఆవిష్కరణతో యువతలో ‘థింకింగ్‌ స్కిల్స్‌’కు ప్రమాదం ఏర్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఇప్పటికే ఛాట్‌ జిపిటీ యూప్‌ వాడకాన్ని నిషేధించే స్థాయికి చేరింది. ఛాట్‌ జిపిటీ యాప్‌ వాడకంతో విద్యార్థుల్లో ఆలోచనాశక్తి తగ్గడంతోపాటు ఉపాధ్యాయుల బోధన అవసరాలైన లెసన్‌ప్లాన్లు, అసైన్‌మెంట్లను కూడా ఈ యాప్‌ అందించనున్నది. దీనితో ఉపాధ్యాయులపై పనిభారం తగ్గడంతో పాటు సమయం ఆదా కావడానికి ఆస్కారం ఏర్పడిరది. ఛాట్‌ జిపిటీ యాప్‌ను అతిగా వాడిన యువతలో క్రిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ క్షీణించనున్నాయి. విద్యార్థుల్లో సృజనశీల ఆలోచనల సామర్థ్యాలకు తలుపులు మూయబడతాయి. ఛాట్‌ జిపిటీ ఇచ్చే సమాధానాలు కొన్ని సందర్భాల్లో పూర్తిగా సరైనవిగా ఉండకపోయినా విద్యార్థులు సర్దుకు పోవలసిన అగత్యం ఏర్పడవచ్చు. ఛాట్‌ జిపిటీ యాప్‌ వాడకంతో మానవీయకోణం సమసిపోయి, సహానుభూతికి ప్రమాదం ఏర్పడుతుంది. అతిగా ఛాట్‌ జిపిటీ యాప్‌ను నమ్మితే వ్యక్తిలో ప్రేరణస్థాయి తగ్గిపోయి, రానున్నతరాల్లో మానవ తెలివితేటలకు ప్రాధాన్యం తగ్గుతుంది. ఇలాంటి శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలతో విద్యాసంస్థలు తమ మూల్యాంకనాలు, పరీక్షా విధానాల్లో భారీ మార్పులు తేవలసి ఉంటుంది.
ఛాట్‌ జిపిటీ యాప్‌ రాకతో భవిష్యత్తు విద్యావిధానంలో కలవరపరిచే ధోరిణిలా చోటు చేసుకోనున్నాయని విద్యావేత్తలు విచారం వ్యక్తం చేసు ్తన్నారు. ఛాట్‌ జిపిటీ ప్రవేశంతో రానున్న రోజుల్లో ఎలాంటి అవాంఛ నీయ/వాంఛనీయ మార్పులు వస్తాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఛాట్‌జిపీటీతో సాంకేతిక విప్లవం ఆగిపోతుందని అనుకోరాదు. సమీప భవిష్యత్తులో ఆర్టిఫీషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(ఏజిఐ), ఎక్స్‌ప్లేన బుల్‌ ఏఐ(ఎక్స్‌ఏఐ), డీప్‌ రిఇన్ఫోర్‌సుడ్‌ లెర్నింగ్‌(డిఆర్‌యల్‌), ట్రాన్స్‌ఫర్‌ లెర్నింగ్‌ లాంటి ఆధునిక సాంకేతికతలు త్వరలో మనముందుకు సునామీలా రాను న్నాయి. ఏ ఆధునిక ఆవిష్కరణ జరిగినా మానవ మేధస్సుకు పదును పెట్టేది గా ఉండాలని, ముఖ్యంగా విద్యావిధానంలో పాత్రకు సరిహద్దులు ఉండా లని విద్యావేత్తలు, నిపుణులు, సంబంధిత సమాజం కోరుకుంటున్నారు.

   ` బిఎంఆర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img