Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఇల్లు అలికిన ఇంగ్లీషు!

బేమ్మలు బాసూ! లౌక్యులు! బతుకు యావ లేకుండా, దేముడుమతంఅనుష్ఠానంనైవేద్యంపంచపాత్ర అనుకుంటూ అదేదో లోకంలో విహరిస్తున్నట్టుంటారు. కాసులు మూట గట్టాలని లేదు భూములు చాప చుట్టేయాలని లేదు. అంతా ఫక్తు ఆధ్యాత్మికంతత్త్వంతర్కం అన్నట్టుంటారు. ‘‘కానీ నిజానికి బేమ్మలకి అంత సీన్‌ లేదు. పైకి కనబడే తంతు అదంతా, బతుకుతెరువు ఆలోచించి మతాన్ని పెరటి విత్తు చేశారు. గుడిపై అజమాయిషీ కాసు పెద్దలకి, కామందులకి వదిలేసి, గుళ్లో అర్చకత్వం ఒడుపుగా పట్టేసి జరుగుబాటుకి లోటులేని అడ్డా కుదురుకున్నారు బేమ్మలు మంచిగా’’ అంటాడు మా వీధి గిరీశం. కన్యాశుల్కం గిరీశం కంటే అతగాడు రెండాకులు ఎక్కువ చదివాడు. గురజాడ గారి గిరీశం కన్యాశుల్కం చదవలేదువచన కవిత్వం వినలేదు. సినేమా పాటలు తెలియదు. బొంకుల దిబ్బ ఊరివాడే ఘంటసాల అని కూడా ఎరుగడు. ఈ భోగట్టా మొత్తం మా వీధి గిరీశానికి కొట్టిన పిండి. అందుకే ఆ గిరీశం కంటే రెండాకులు ఎక్కువ చదివాడంటున్నది!
గిరీశం స్మార్తం తెలిసిన బేమ్మడే అయినా ఇంగ్లీషుకి వ్యతిరేకం కాదు. ‘ఎలివెన్‌ కాజెస్‌ ఫర్‌ ది డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఏకబిగిన పాఠం చెబుతాడు. ఎటొచ్చీ ఎవరికి చెప్పాలో తెలియదు. బండెంకడికి సోషియాలజీ, శిష్యుడు వెంకటేశానికి చుట్టలు కాల్చడం పాఠాలు చెబుతాడు. గిరీశం చుట్టాల దగ్గర ఆగాడు. మా వీధి గిరీశం ‘బుడ్డిమంతుడు’ కూడా. ఇంతకీ చెప్పొచ్చే మాటమా వీధి గిరీశం ఇంగ్లీషు చదువుల మీద ఏకబిగిన లెక్చరివ్వగలడు. మందు వాసన పట్టించుకోకపోతే అతని ప్రసంగంలో విషయం ఎన్నదగినదే. ఉదాహరణకి ‘‘దేశం ఇంగ్లీషు చదువులతోనే బాగుపడిరది’ అంటాడు. ఇంగ్లీషు, మాథ్స్‌, జాగ్రఫీ, బయాలజీ, జువాలజీ ఇలా శాస్త్ర విద్య ఇంగ్లీషు స్కూల్‌తోనే కొత్త కాలవ నీరులా దేశాన్ని ప్రవాహ వేగంతో తడిపింది’ అంటాడు. ‘ఇవన్నీ మాకూ ఉన్నాయ్‌. ఎప్పుడో కనిపెట్టేశాం. మా వేదాల్లో అన్నీ ఉన్నాయి. అని ఎత్తుకెళ్ళి మళ్ల మన నెత్తినే రుద్దుతున్నారు. అణుబాంబులు, విమానాలు, జలాంతర్గాములు, రోదసీ నౌకలు అన్నీ వేదాల్లో ఉన్నాయ్‌. కాబట్టి మాకే మీ ఓటు’ తరహాలో మాట్లాడేవాళ్ళని ఆక్సిజన్‌ సప్లయ్‌ లేని కార్పొరేట్‌ ఆసుపత్రి పడకలు ఎక్కించాలి అంటాడు. అవన్నీ ప్రపంచ యుద్ధ అవసరాలకు తప్ప పంచపాత్రల గొప్ప కోసం పుట్టలేదంటాడు. అవును మరి అణుబాంబులు చేయడం, ఆవకాయ్‌, మాగాయ్‌లా పెట్టడం కదా! అని విస్తుపోతాం మనమే. ఇంకో ఎండెమ్‌ లాంటి మాట చెప్తాడు మా వీధి గిరీశం. ‘అసలు బ్రాహ్మలు కూడా ఇంగ్లీషు చదువులతో ఉద్ధరింపబడ్డవాళ్లే అంటాడు. ఏ మంత్రాల బ్రాహ్మడు తన పిల్లల్ని ఇంగ్లీషు మీడియమ్‌ స్కూళ్లలో తప్ప ఆషామాషీగా చదివించడు పందెం’ అని కనుబొమ్మలు ఎగరేస్తూ కళ్లలోకి చూస్తాడు సమాధానం కోసం.
ఇంకో మాట. బేమ్మలు ఒకరి జోలీ నాలీ లేకుండా ఏదో తమ బతుకు తాము ఓ మూల మంచిగాబతికేస్తున్నవాళ్లు కారెంత మాత్రం కాదంటాడు. కులాలు, మత నియమాలు పేరిట గిరులు గీసి, మతాన్నీ దేముణ్ణీ పెరటి విత్తు చేసి, సమస్త జ్ఞానం వేదాల్లో ఉందని వాక్రుచ్చుతూనే అని చదివిన ఇతరుల చెవుల్లో సీసం పోస్తామనడం ఎందుకు? కామందు కమతమే బేపనోడి వేదం! విమానం, అణుబాంబులుఇవేవీ మన దేశంలో పేలలేదు, ఈదలేదు. ఎగరలేదు. యుద్ధ అవసరాలకు ఎక్కడో పుట్టి ఎక్కడో పేలాయి ఎగిరాయి ఈదాయి! మరి వేదాలు సరే గొప్పవే మరి ఎందుకు జనంలో వ్యాప్తి చేయలేదుఇప్పుడు జన జీవితంలో ఏవీ? ఎక్కడ? అసలు మన మతానికి డాక్ట్రిన్‌ ఏది? ఈ మసిపూసి మారేడు కాయ చేసింది ఎవరు? బతుకు తెరవు బేమ్మలది కాదా? ఇంతకీ అసలు సంగతి ` ఇంగ్లీషు చదువులే ఇండియా ఇల్లు అలికాయి. దట్సాల్‌!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img