Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉద్యోగాలపై మోదీ వక్రీకరణ

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

ఉద్యోగాల మార్కెట్‌, స్వయం ఉపాధిరంగం అభివృద్ధి చెందు తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం పూర్తి వక్రీకరణతో కూడినది. 2023 మొదటి ‘రోజ్‌గార్‌ మేళా’ నిర్వహించి నప్పుడు మోదీ ఈ రెండు అంశాలను నొక్కి చెప్పారు. అయితే వాస్తవాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. కార్మిక వర్గాలు అసాధారణ మైన కష్టాలను ఎదుర్కొంటునప్పటికీ, మోదీ ఈ అంశాన్ని పరిష్కరించ కుండా వాస్తవాలను దాచేస్తున్నారు. పనిచేసే వయసులోఉన్న అత్యధికులకు ఉద్యోగాలు లేవు. మోదీ అనుసరిస్తున్న విధానాలు అవసరమైనన్ని ఉద్యోగాలను సృష్టించడంలేదు. అలాగే గౌరవప్రదమైన ఉద్యోగాలను కూడా సృష్టించడంలేదు. జీవనోపాధికి అవసరమైనంత ఆదాయంలేని, అనామక పనులుమాత్రం ఎక్కువగానే లభిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా సామాజిక భద్రతనుకల్పించే మంచి ఉద్యోగాలు, సంఘటితరంగంలో ఉద్యోగాలు కుచించుకుపోతున్నాయి. 2014లో అధికారానికి రాకముందు ఎన్నికల ప్రచారంలో గౌరవనీయమైన ఉద్యోగాలను కల్పిస్తామని ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని డొల్లహామీ ఒకటిఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగం గత నాలుగు దశాబ్దాలలో లేనంత ఎక్కువగా నమోదైంది. 2013లో నిరుద్యోగం రేటు 4.1శాతం కాగా, 201718నాటికి 6.1 శాతానికి ఎగబాకింది. గత 45ఏళ్లలో ఏనాడూలేనంతగా నిరుద్యోగులు ఉపాధిలేక తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. మోదీ పాలనలో దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఏనాడూలేనంతగా ఉద్యోగాలు ఊడిపోయాయి. మోదీ ప్రభుత్వంలో ఉద్యోగాలులేని కాలంలోకి భారతదేశం ప్రవేశించిందన్న విషయం వాస్తవం. 2022, డిసెంబరు నాటికి నిరుద్యోగం రేటు సీఎమ్‌ఐఈ నివేదిక ప్రకారం, 8.3శాతం మంది ఈ విషయాన్ని మీడియా దేశవ్యాప్తంగా అందించింది. ప్రభుత్వం చెప్పే నిరుద్యోగుల లెక్కలను నమ్మడానికే అవకాశంలేదని అనేక సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ఉదాహరణకు 45ఏళ్లలో ఏనాడూలేనంత ఎక్కువగా నిరుద్యోగం ఉందని 2019లో ఎన్‌ఎస్‌ఓ నివేదిక చెప్పినప్పటికీ దాన్నిబైటకు చెప్పకుండా మోదీ ప్రభుత్వం దాచివేసింది. మరో ముఖ్యమైన అంశం ఉద్యోగులు, నిరుద్యోగుల గణాంకాలను మోదీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పడమే మానేసింది. గ్రామీణ ప్రాంతాలలో పనులులేని వారిసంఖ్యను వెల్లడిరచడమేలేదు. ఏడాదికి ఒకసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులు సమాచారాన్ని చెబుతున్నప్పటికీ అది ఏమాత్రం నమ్మడానికిలేదు. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒకటి సంవత్సరంలో ఉద్యోగాల మార్కెట్‌ విషయంలో తీవ్ర వక్రీకరణను ప్రకటించారు. నిర్ణీత గడువు ప్రకారం ప్రకటిస్తున్న కార్మికుల సర్వే ప్రకారం వ్యవస్థీకృత మార్పు జరిగింది. వ్యవసాయ రంగంలో పనులు 201819లో 43.5శాతం కాగా, 201920లో 45.6శాతానికి పెరిగింది. అలాగే కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ అంటే 202021లో వ్యవసాయరంగంలో పనులు లభించినవారి శాతం 46.5కి పెరిగింది. అలాగే ఉత్పత్తివాటా 201920లో 11.2శాతం కాగా, 202021లో 12.1శాతానికి పెరిగింది.
నాణ్యమైన ఉద్యోగాలకు సంబంధించి రంగాలవారీగా వచ్చిన మార్పులను కూడా వక్రీకరించారు. గ్రామీణప్రాంతాల్లో క్రమబద్దమైన వేతనాలు, నెలసరి ఇచ్చే వేతనాలకు సంబంధించి నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఫలితంగా సామాజిక భద్రతను కల్పించామని ప్రధాని చెప్పారు. ఈ కాలంలో స్వయంఉపాధి ద్వారా లభించిన ఉద్యోగాలు పెరిగాయి. ఇళ్లల్లో నిర్వహించే చిన్నచిన్న పరిశ్రమలు 13.6శాతం నుంచి 17.3 శాతానికి కోవిడ్‌ కాలంలో పెరిగాయి. క్యాజువల్‌ కార్మికులు 24.9శాతం నుంచి 24.33 శాతానికి తగ్గారు. స్వయంఉపాధి పొందినవారిని ప్రశంసించడం మోదీ ప్రభుత్వానికి తప్పదు. ప్రధాని దృష్టిలో పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే. లాక్‌డౌన్‌ సమయంలో పకోడీలు అమ్మడం, కొనడం లేదని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలి. అలాగే పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాలు అమలుచేసినప్పుడు ఉద్యోగాల మార్కెట్‌ విషయంలో మోదీ వాస్తవాలను వక్రీకరించారు. లాక్‌డౌన్‌ సమయంలో పట్టణాలు, నగరాల నుంచి కార్మికులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కాలినడకన వందలమైళ్లు స్వస్థలాలకు చేరుకున్నారు. వ్యవసాయరంగంలో పనులు లభించనప్పటికీ తక్కువ కూలీకే పనిచేయవలసివచ్చింది. ఇటీవల జరిగిన అధ్యయనంలో 2022లో సైతం అతిప్రధానమైన నగరాలలో కార్మికుల కొరత 68శాతం కాగా, ఇతర నగరాలలో 32శాతం ఉంది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల విధానంలోనూ మోదీ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించింది. ఇప్పటికైనా మోదీ ఉద్యోగాలను కల్పించే అభివృద్ధి విధానాలను అవలంబించి కార్మికులకు, ఉద్యోగాలకు సామాజిక భద్రతను అందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img