Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ఎన్నికల వ్యవస్థ లోపాలమయం

డి. రాజా,
సీపీఐ ప్రధాన కార్యదర్శి

మన దేశ గొప్ప వైవిధ్యం పట్ల లోతైన అవ గాహనతోనే రాజ్యాంగం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. న్యాయం, సమా నత్వం సూత్రాల ఔన్న త్యాన్ని కాపాడుతూనే వీటిని రాజ్యాంగంలో చేర్చి అమలు చేయాలి. బలమైన ప్రాతినిధ్యం, గుర్తింపుతో ప్రజాస్వామ్యం అమలు చేయాలి. రాజ్యాంగం ఆకాంక్షించిన వాటిలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఒకటి. జాతీయ, స్థానిక ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తోడ్పాటు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశాలను విభజించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థ పరిధిలో పనిచేస్తూ, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేందుకు న్యాయమైన మాధ్యమంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల చట్టసభకు గడువు ప్రకారం న్యాయంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని గుర్తించారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికిగాను, స్వతంత్రతగల, శాశ్వతంగా పనిచేసే భారత ఎన్నికల కమిషన్‌ను నెలకొల్పాలని అంబేద్కర్‌ దృఢంగా వాదించారు. ఈ విలువను రాజ్యాంగంలో 324 ఆర్టికల్స్‌లో పొందుపరిచారు. విచారకరంగా రాజ్యంగ విలువను ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘిస్తూ నిత్యం ‘ఒకే దేశంఒకే ఎన్నిక’ నినాదాన్ని జపం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రాధాన్యతపై నిరంతరం చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి. దుష్ట ప్రణాళికను అమలు జరిపేందుకు అవకాశాల పరిశీలనకు పూర్వపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిటీ సిఫారసులను రూపొందించి ఉంటుందని కమిటీ సభ్యులను, కమిటీకిచ్చిన అంశం చూస్తేనే తెలిసిపోతుంది. ప్రధాని నరేంద్రమోదీ ‘ఏకత్వం’ పై మోదీ జపం వెనుక దాగి ఉన్న రహస్యం ఎవరికీ తెలియంది కాదు. ‘ఒకే దేశం ఒకే పన్నుఒకే ఎన్నిక’ లాంటి ఏకశిలా విధానానికి అంతం ఎక్కడనేది ఎవరైనా ఊహించగలరా! కొంతకాలం క్రితం, రాష్ట్ర అసెంబ్లీలు, లోకసభకు ఒకేసారి ఎన్నికలు జరపవచ్చునా అన్న అంశంపై అభిప్రాయాన్ని భారత న్యాయ కమిషన్‌ కోరింది. భారత్‌ ఇప్పటికే ఈ అంశంపై పరిశీలన జరుగుతుండగా మళ్లీ కమిటీని నియమించవలసిన అవసరం ఏమిటి? అంతకు ముందు వేసిన కమిషన్‌ జమిలి ఎన్నికలకు న్యాయబద్దత ఉందా లేదా తెలుసుకొనేందుకేనని చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏకీభావం లేకుండానే ఏకపక్షంగా ఊహించడం ఎలా అని న్యాయ కమిషన్‌ ప్రశ్నలు సూటిగా అడిగింది. అయితే ఈ విధానం ఎక్కడా లేదు. ప్రధాన మంత్రి జమిలి ఎన్నికల నిర్వహణ కోసం పదేపదే మాట్లాడారు. ఆయన ఈ విషయం తీవ్రంగానే తీసుకున్నారు. అందుకనే ప్రభుత్వం మళ్లీ కమిటీ వేసింది. ప్రధాని కోరుకున్న రీతిలోనే కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మనం లోతుగా ఆలోచించి పరిశీలించాలి. లోకసభకు, అసెంబ్లీలకు వేరు వేరుగా ఎన్నికలు జరిపితే వచ్చే నష్టమేమిటి? జమిలి ఎన్నికలు జరపడం అవసరమా? ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో ప్రజాస్వామ్యకంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఐదేళ్ల గడువు ముగిసే వరకు ప్రభుత్వం కొనసాగించడానికి హక్కు ఉంది. డా.అంబేద్కర్‌, ఇతరులు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు స్థిరమైన ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని కోరుకున్నారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ ద్వారా వివిధ రాష్ట్రాల ప్రజల అభిప్రాయం ఒకటిగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బాధ్యత, జవాబుదారీతనం మాయమవుతాయి. ఐదేళ్ల కొకసారి ప్రజలను కలుసుకొనే అవకాశం రాజకీయ పార్టీలకు ఉండదు. ఈ విధానాన్ని అమలు చేస్తే, అవిశ్వాస తీర్మానం తర్వాత లోకసభ రద్దయినా లేక సంకీర్ణ ప్రభుత్వానికి స్థిరమైన మెజారిటీ లేకపోయినా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. ఒక రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అయిందా లేదా అన్న దానితో నిమిత్తంలేదు. మన దేశం రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత అసెంబ్లీలకు, లోకసభóకు కలిపే ఎన్నికలు జరిగాయి. మొదటిసారి ఎన్నికలే జమిలిగా ఎందుకు జరిగాయో ఉన్న ఇబ్బందేమిటో అందరికీ తెలుసు. 1957లో రెండవసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టుపార్టీ(సీపీఐ) కేరళ రాష్ట్రంలో గెలుపొందింది. ఈ కారణంతోనే విడివిడిగా ఎన్నికలు జరపడం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను మొట్టమొదటిసారిగా సీపీఐ మంత్రివర్గంపై ప్రయోగించారు. దీనితో 1960లో కేరళ అసెంబ్లీకి మరొకసారి ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధంలేదు. 1965లో కేరళ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలతో సంబంధం లేకుండానే నిర్వహించారు. అప్పుడు ఏ పార్టీ కూడా మెజారిటీని నిరూపించలేకపోయింది. దానితో 1967లో లోకసభó ఎన్నికలతోపాటు కేరళ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి.
1967లో రాజకీయ రంగంలోకి అనేక శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఎన్నికలు ఒకేపార్టీ పాలనకు సవాలు విసిరాయి. ప్రజాస్వామ్యం ప్రజల్లో విస్తరించిందని వివిధ రాజకీయపార్టీలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగినాయని చెప్పడానికి 1967 ఎన్నికల ఫలితాలు తెలిపాయి. జమిలి ఎన్నికలకు దూరంగా జరిగి విడివిడిగా ఎన్నికలు జరిగాక ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్య, న్యాయబద్దమైన ఎన్నికలు ప్రతిబింబించాయి. బాబ్రి మసీదు కూల్చివేత అనంతరం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రాష్ట్రపతి రద్దుచేశారు. రాజ్యాంగం యంత్రాంగం విఫలమైందని, అందువల్ల రద్దుచేసామని చెప్పారు. అప్పుడు రాష్ట్రపతి పాలనను ప్రతిపక్షంలోనున్న సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మణిపూర్‌లో రాష్ట్రప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయినందున అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఏ యంత్రాంగం పనిచేయకపోవడంతోనే రాష్ట్రపతి పాలనను పార్టీ కోరింది. ‘‘ఒకే దేశం`ఒకే ఎన్నికలు’’ జరపడంవల్ల ఆర్థికభారం తగ్గుతుందని చెబుతున్నారు. ఒకేసారి ఎన్నికలు జరగడంవల్ల వేలాదికోట్ల రూపాయలు వ్యయం కాకుండా ఆదా అవుతుందని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంచేసే వ్యయం పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సిబ్బందికి టీఏ, డీఏలు, రవాణా ఏర్పాట్లు, ఇంకు కొనుగోలు తదితర ఖర్చు లుంటాయి.. ఒకేసారి ఎన్నికలు జరగడంవల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయా? లేక ఖర్చులు పెరుగుతాయా? ఎన్నికల ఖర్చులను జాగ్రత్తగా అంచనావేయడం, గణించడం అవసరంగానీ ఏదో పైపైన అంచనావేసి చెప్పడం సరైందికాదని ఎన్నికల కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఉదాహరణకు 2014లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోకసభóకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ 1.66కోట్లు ఖర్చు చేసింది. మరో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఒకసారి, ఆ తర్వాత లోకసభకు మరోసారి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు ఎన్నికలకు కలిపి 1.43 కోట్లు మాత్రమే ఖర్చయింది. ఒకేసారిగాని, లేదా విడివిడిగాగానీ ఎన్నికల ఖర్చులో తేడా చాలా స్వల్పం. ఒకేసారి ఎన్నికలు జరిగితే, గతంలో ఏనాడూ అవసరంలేనన్ని ఈవీఎంలు కొనుగోలు చేయాలి. ఇందుకోసం భారీ మొత్తాల్లో ఖర్చు చేయవలసి ఉంటుంది. మన దేశానికి ఇప్పుడు అవసరమైనది సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగడానికి ఈ సంస్కరణలు అవసరం. కావలసింది నరేంద్ర మోదీ బూటకపు పరిష్కారాలు కాదు.
గతంలో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ ఎన్నికలకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని సిఫారసుచేసింది. ఎన్నికల బాండ్ల వంటివాటి ద్వారా అవినీతిని వ్యవస్థీకృతం చేయడాన్ని తక్షణం ఆపివేయాలి. చట్టాలను సమర్థంగా అమలుజరిపి డబ్బుపంపిణీ, కండబలం చూపడం వంటివాటిని నిరోధించాలని కమిటీ కోరింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విద్వేషప్రసంగాలను ఎమైనా ఆపుతుందా? మీడియా సంస్థలు స్వేచ్ఛా ప్రసంగాలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటిని సరైనవిధంగా ఎదుర్కోవాలి. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. 2019లో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల నియంతృత్వంగా మార్చివేసి మెజారిటీ తెచ్చుకున్నారు. వీటన్నింటిని మార్పు చేయవలసిన అవసరంఉంది. మోదీ రూపొందించిన భారీ డిజైన్లన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. అంతిమంగా ప్రజలకు ఈతిబాధలే మిగిల్చాడు. పెద్దనోట్ల రద్దు, డిఎస్‌సి మన ఆర్థికవ్యవస్థను ధ్వంసం చేశాయి. ప్రధాని మోదీ, ఆయన పార్టీ 2019నుంచి జమ్ము కాశ్మీర్‌నుంచి ప్రాతినిధ్యంలేకుండా చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య, దేశభక్తియుత విలువలుగల రాజకీయపార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడటంతో బీజేపీ వణికిపోతోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఎన్నికల కమిషన్‌ నియామకంలో మార్పు తదితర అంశాలు పరిశీలించినప్పుడు ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో నెలకొన్న లోపాలకు బీజేపీ జవాబుచెప్పే విధానం ఇదికాదు. ప్రజాస్వామ్యాన్ని నాశనంచేసి అధికారంలో కొనసాగేందుకు ఒకే ఎన్నికల ఒకే దేశం అని బరితెగించి ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img