Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

కృత్రిమ మేథ అత్యంత ప్రమాదం

కె.రవీంద్రన్‌

కృత్రిమ మేథ మానవాళి ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపుతుందని చాలామంది మేథావులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో ఇది అత్యంత ప్రమాదకరమైందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అమెరికా సెనేట్‌ కమిటీ సమావేశంలో ఛాట్‌జీపీటీ వ్యవస్థాపకులు శామ్‌ ఆల్ట్‌మన్‌ మానవాళికి కలిగే ప్రమాదాన్ని వివరించారు. అన్ని దేశాల ప్రభుత్వాలు కృత్రిమ మేథ వినియోగాన్ని అత్యంత పకడ్బందీగా క్రమబద్దీకరించాలని లేనట్లయితే అది అనేక రంగాలలో ప్రమాదకారిగా ఉంటుందని హెచ్చరించారు. నూతన సాంకేతికత అయిన కృత్రిమ మేథ ఊహించలేనంతగా నిరుద్యోగ సమస్యను కూడా సృష్టిస్తుందని ఆందోళన చెందుతున్నారు. శామ్‌ మాట్లాడుతూ ఈ సాంకేతిక పరిశ్రమ ప్రపంచానికి ఎంతగానో హానిచేస్తుందని తానుభయపడు తున్నట్లు ఆల్ట్‌మన్‌ చెప్పారు. ఏ మాత్రం ఇది తప్పుదారిపట్టినా కలిగే ప్రమాదాన్ని ఊహించలేమన్నారు. ఈ సాంకేతికతను దుర్వినియోగంచేసే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
కృత్రిమ మేథ ద్వారా పట్టుదలతో అల్లిన సమాచారాన్ని విస్తరించినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదం కలుగుతుంది. నిరంకుశ ప్రభుత్వాలు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలాంటి ప్రజాస్వామ్య దేశాలలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిరంకుశ పోకడలవైపు వెళుతున్నాయి. ఈ సాంకేతికత అందుబాటు లోకి వచ్చినట్లయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలే కుప్పకూలిపోతాయి. భారతదేశంలో ఉద్దేశించిన లక్ష్యాల నుండి ఇతర ఫలితాలను పొందేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తేలికగా ఇలాంటి సాంకేతికత అందుబాటులో ఉన్నట్లయితే అది అత్యంత ప్రమాదానికి దారితీస్తుంది. కృత్రిమ మేథ సమాచార సృష్టి, చిత్రాల రూపకల్పన లేదా వీడియో ఆధారిత సమాచారం అందించడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలు, మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా రూపుమారి పోతాయి. కృత్రిమమేథ వల్ల మానవ స్వభావమే మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్‌, ప్రపంచవ్యాప్తంగా వెబ్‌ పరిజ్ఞానం అనేక విధ్వంసాలను కూడా సృష్టిస్తున్నది. కృత్రిమ మేథ వల్ల కొత్త ఉద్యోగాలు లభించడం చాలా కష్టమవుతుంది. ఈ సాంకేతికత విస్తరించడం వల్ల అమెరికాలోనే మూడిరట రెండువంతుల మంది ఉద్యోగాలపై వేటుపడుతుందని గోల్డ్‌మన్‌ సాచెట్స్‌ అంచనావేసింది.
చాట్‌జీపీటీ వినియోగం పెరగడం వల్ల కొన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే కంపెనీలు ప్రమాదానికి లోనవుతున్నాయి. అమెరికాలో విద్యాబోధనకు పనిచేసే టెక్‌ కంపెనీ ఛెగ్‌ ఇంటివద్దనుండే పాఠాలు వినడానికి సాంకేతికతను అందిస్తున్న పెద్ద కంపెనీ బైజూస్‌ నూతన సాంకేతికతతో తీవ్రమైన ఇబ్బందులను తెచ్చుకుంటున్నదని ఈ కంపెనీ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదని తెలుస్తున్నది. బైజూస్‌ కంపెనీ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నదని, క్రమబద్దీకరణకు సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిరదని, అత్యంత ఖరీదైన ప్యాకేజీలకు సబ్‌స్రైబ్‌ చేయాలని వత్తిడి చేస్తున్నదని ఆరోపణలువచ్చాయి. ప్రముఖ కంపెనీల ఎగ్జికూటివ్‌లు తమకు ఇచ్చిన లక్ష్యాలను ఛాట్‌బోట్లకు అప్పగిస్తున్నారని ఇవి వ్యూహాలను రూపొందించడంలో మేలుగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. కచ్చితత్వం, విశ్వసనీయత అనే అంశాలను పక్కనబెడితే కృత్రిమ టూల్స్‌ అందించే సమాచారం వేగంగా విస్తరిస్తున్నది. కృత్రిమ మేథ పెట్టుబడీదారీ వ్యవస్థకు, మానవాళికి ఉపయోగపడుతుంది. అయితే ప్రజాజీవనంలో కృత్రిమ మేథతో పనిచేసే యంత్రాలతో మనుషులు పోటీపడలేరని స్టాక్‌ బ్రోకింగ్‌ జిరోథ కంపెనీ వ్యవస్థాపకులు నితిన్‌ కామత్‌ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img