Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

కొమ్ము కాచే కొమ్ములు

చింతపట్ల సుదర్శన్‌
ఇంకో అరగంటలో డ్యూటీ అయిపోతుందన్న ఆనందంలో సూర్యుడి ముఖం నారింజరంగులో మెరుస్తున్నది. అరుగుమీద పడుతున్న కిరణాల వెలుగులో వెన్నును గోడకు ఆనించి విశ్రాంతి తీసుకుంటున్న గాడిద ఉదయం నమిలిన పేపర్లలోని విషయాలను నెమరు వేసుకుంటున్నది. ఆ రోజుకి కడుపు నిండిన కుక్క హుశారుగా తోకతో ఆడుకుంటున్నది. అడుగుల చప్పుడు వినపడి సగం మూసుకున్న కళ్లతో ‘డాగీ!’ అబ్బాయి వచ్చాడా అంది గాడిద. తోకతో ఆడటం ఆపి చూసివచ్చింది అబ్బాయి కాదు అమ్మాయి అంది కుక్క. గాడిద కళ్లు పూర్తిగా తెరిచింది. వచ్చిన ఆ మహిళ వైపు చూస్తూ మొరుగుదామా వద్దా అని ఆలోచించ సాగింది కుక్క. ఈ విషయాన్ని పసిగట్టి తొందరపడకు ‘బ్రో’ ఈ దేశంలో అమ్మాయిలకు అడుగడుగునా ఆపదలేకదా. ప్రేమించానని మోసం చేసేవాడొకడు, ప్రేమించి మనసు మార్చుకునే వాడొకడు తనకే ఏ మాత్రం ‘రిస్కు’ లేకుండా ఆడది దొరికితేచాలు అనుకునే వాడొకడు, ఆసిడ్‌ పోసేవాడొకడు, పైశాచిక ఆనందాన్ని పొంది పెట్రోలు పోసి తగలబెట్టే వాడొకడు. ఆడవాళ్లకు రక్షణ ఎక్కడుంది. గాంధీజీ కన్నకల కల్లే. ఈ అమ్మాయి ఏదైనా ఆపదలో ఉందేమో పాపం అంది గాడిద.
గాడిద మాట్లాడుతుంటే అరుగు అంచున కూచున్న అమ్మాయివైపు పరీక్షగా చూసింది కుక్క. ఆ అమ్మాయి అబలలా కనిపించలేదు. ఎంతో ధృడంగా బలంగా కనిపించింది. ఇంకా నయం తొందరపడి మొరగలేదు. చిర్రెత్తి ఆ బలమైన చేయి విసిరిందా ‘ఆర్ఘోపెడిక్‌ సర్జన్‌’ ని చూడాల్సి వచ్చేది అనుకుంది కుక్క. అరుగుమీద దిగులుగా కూచున్న అమ్మాయివైపు చూస్తూ ‘క్యాహువా బహెన్‌ జీ ఉదాస్‌ దిఖ్‌రహేహో’ (ఏమైంది సోదరీ విచారంగా కనపడుతున్నావు) అంది గాడిద ఆమె వైపు ఒళ్లుతిప్పి. ఆమ్మాయి ఉలిక్కిపడిరది. గాభరా పడకు మా ఇద్దరికీ మాటలు వచ్చు అంది కుక్క ముందు కాళ్లు పైకి లేపి వెనక కాళ్లమీద కూచుంటూ. కుక్కలకన్నా గాడిదల కన్నా హీనమైన మనుషుల్ని చూసిన అమ్మాయి నిశ్చలనంగా ఉంది. ఇక్కడికి ఎవరూ రారు తెలుగు అబ్బాయి తప్ప నువ్వెంత సేపైనా కూర్చోవచ్చు అంటూ అమ్మాయి ముఖం వైపు చూసి అరెరే చెంప ఎర్రగా ఉందే, ముక్కుమీద ఆ దెబ్బ ఏమిటి, కంటికింద కమిలినట్టుందే అసలేం జరిగింది అంది గాడిద.
ఏ గాడిదకొడుకైనా వెంటపడ్డాడా చెప్పు. వాడు ఇటు గనకవస్తే వాడి పిక్క మామిడిపండు కొరికినట్టు కొరికేస్తాం అంది కుక్క. తర్వాత నాలుక్క రచుకుని సారీ ‘డాంకీ బ్రో’ అనుకోకుండా కూసేశాను, బ్రో’ అను కోకుండా వెరీ సారీ నిన్నేమీ అనలేదు అంది కుక్క. ఛండాలపు పనులు, దరిద్రపు చేష్టలూ చేసేవాళ్లని అనడానికి నన్నే ఆదర్శంగా తీసుకుంటారు జనం. నువ్యూ ‘ఫ్లో’లో అనేశావు. ఇట్స్‌ ఓ…కె..బహన్‌జీ బోలోనా అంది గాడిద. అమ్మాయి షాక్‌ నుంచి తేరుకున్నట్లుంది ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బాదారు అందరినీ, తలలూ ముఖాలూ పగిలాయి. చేతులూ, కాళ్లూ విరిగాయి అంది అమ్మాయి. ఎవరువాళ్లు నిన్ను చూస్తే బలంగా వస్తాదులా ఉన్నావు అయినా ఆడవాళ్లను కొట్టిన ఆ నీచ్‌ కమీనే కుత్తేలెవ్వరు అన్నది గాడిద, కుక్క తనను అన్నదానికి రిటర్న్‌ గిఫ్టు ఇచ్చుకుంటూ. ఐడోంట్‌ మైండ్‌. నేను నిన్ను, నువ్వునన్ను అన్నానన్నావు. బ్యాలెన్స్‌ అయిందిలే అంది కుక్క.
నేను ఒక ‘రెజ్‌లర్ని’ అందాఅమ్మాయి. అంటే అంది అర్థంకాక కుక్క. మల్ల యోధురాలోయ్‌ అంది గాడిద. వస్తాదా! వామ్మో ఇంకా నయం. అరవక పోవడమే మంచిదైంది అంది కుక్క. అవును వస్తాదునే. నేనునా తోటి ఆడవస్తాదులు అందరం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే… మధ్యలోనే అందుకున్న గాడిద అర్థమైంది నిన్ను కొట్టింది పోలీసులై ఉంటారు. ‘యామ్‌ ఐ రైట్‌’ అంది గాడిద. అవును నువ్వన్నది కరెక్టే. ఎలా తెల్సుకున్నావు అందామె. పోలీసుదెబ్బలు గుర్తుపట్టవచ్చులే. నిరసనలు, ధర్నాలు శాంతియుతంగా జరిపేవాళ్లని ‘జంతర్‌ మంతర్‌ భూమంతర్‌’ అని చెదరగొట్టడానికీ, బెదరగొట్టడానికే గద ప్రభుత్వాలు వాళ్ల ఆటలుసాగ నిచ్చే పోలీసులుఉన్నది. ఇప్పుడు నాకు అంతాఅర్థం అయిపోయింది. మల్లయోధుల సమాఖ్య అవకతవకలు గురించి చదివాను అంది గాడిద.
నేరాలు చేసిన వ్యక్తిమీద కనీసం ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కూడా ఒప్పు కోలేదు ప్రభుత్వం. సుప్రీంకోర్టు తలదూర్చక తప్పలేదు, అయినా ఇప్పటికీ అరెస్టు లేదు అన్నాడు అప్పుడే అరుగు ఎక్కిన అబ్బాయి. అమ్మాయి వైపు చూస్తూ. నీకెలా తెల్సు అనడిగింది కుక్క. పోలీసులు మహిళా రెజ్‌లర్స్‌ మీద లాఠీలతో విరుచుకుపడ్డం చూశా అన్నాడు అబ్బాయి. పోలీసులు కాబట్టి ఊరుకున్నారు మరొకళ్లయితే మక్కెలు విరిగేవే అంది గాడిద. ఏడుపదుల వయస్సు దగ్గరపడుతున్న ఆడవాళ్లపై లైంగిక హింసకు పాల్పడిన యోధుడిచేత జైలు ఊచలు లెక్కపెట్టించాల్సిందే అన్నాడు అబ్బాయి. అదెలా కుదురుతుంది. ఆయన నాలుగుసార్లు జనం ఓట్లువోసి గెలిపించిన ప్రజాప్రతినిధి కదా. వేధించడం, సాధించడం ప్రజాసేవలో భాగంకదా. పైగా సర్కారు పార్టీవాడు కదా. ఆయన్ని తొలగించరు ఆయనకు కరువైంది బుద్ధేకనక రాజీనామా చేయడు అన్నది గాడిద. అధికారపార్టీలో ఉండేవాళ్లకు ఉన్న అనేక రాయితీల్లో ఏ నేరం చేసినా సరే శిక్ష లేదు అనేదికూడా ఉన్నదా అందికుక్క.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనను ఆపం. తాడోపేడో తేల్చుకుంటాం అంది పోలీసుల దెపబ్బలుతిన్న మహిళాయోధ. మీకు అండగా ఇదివరకు ప్రభుత్వం చేత మూడు చెరువులు నీళ్లు తాగించిన రైతన్నలు వస్తున్నారు అన్నాడు అబ్బాయి. ప్రజాప్రతినిధులే బరితెగించడం సిగ్గుచేటు. ఆడవాళ్లను గౌరవించని పార్టీ పార్టీయేనా, మనిషి మనిషేనా అన్నది కుక్క. బహెన్‌జీ! దుర్మార్గుల కొమ్ముకాచే కొమ్ములు తిరిగిన ప్రభుత్వాలు కూడా కూలిపోయినవని చరిత్ర చెబుతున్నది అంది గాడిద.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img