డాక్టర్ దేవరాజు మహారాజు
సావర్కర్ ఎంతటి దేశద్రోహానికి తలపడ్డా, తనపుస్తకం ‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్’లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని ప్రభుత్వపెద్దలు శ్రద్ధగా మళ్లీమళ్లీ చదువుకోవడం అవసరం. ఎందుకంటే ఆ రాసినవాడు వారిదృష్టిలో మహా నాయకుడు గనక! సావర్కర్ తన పుస్తకంలో ఇలా రాశాడు. ‘ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవజాతి స్థాయి నుంచి కిందికి దిగజారిన వారవుతారు…ఇంకా గోవు ఒక జంతువని, దానికిలేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటేఅది మూర్ఖత్వమవు తుందనీ’ స్పష్టంగా రాశాడు` వినాయక్ దామోదర్ సావర్కర్! అవు ఎంతటి నికృష్టపు జంతువంటే, అది తన మలంలోనే అదిపొర్లుతుంటుంది. దానికి బుద్దీ, జ్ఞానం ఉండవు గనకనే తను వేసిన పేడలో అది పొర్లుతుంటుంది’ అనికూడా రాశాడు. ఇదికాక, సావర్కర్ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు. మొఘలులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం తమనే వర్తిస్తుందన్న భ్రమలోఉండిపోయారనీ, అదెంత సిగ్గుచేటని రాశాడు సావర్కర్!
వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర. కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకుని, బ్రిటీషువారికి సహకరించినవాడు. పైగా సెల్యులర్ జైలులో ఉన్నప్పుడు బ్రిటీష్ ప్రభుత్వానికి ఎనిమిది సార్లు వినతిపత్రాలు సమర్పించి క్షమాపణలు కోరిన వ్యక్తి. అంతకుముందు అతను బ్రిటన్‌లో ఉండగా ఒక రేప్ కేసులో దొరికిపోయి, తప్పు ఒప్పుకుని, శిక్ష అనుభవించినవాడు. ఇలాంటి వాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెడతారా? ఆ ఆలోచనే సిగ్గుపడాల్సిందిగా ఉంది. ఆనాటి హిందువుల్ని ముఖ్యంగా ఆర్య బ్రాహ్మణుల్ని ఏకం చేయడానికి ఇతర మతస్థుల మీద, ఇతర కులస్థుల మీద విషం చిమ్మిన వ్యక్తిసావర్కర్! దేశంలో కేవలం ఆర్యబ్రాహ్మణులు మాత్రమే ఉండాలని తాపత్రయ పడినవాడు. శత్రువులు బ్రిటీషువారు కాదు, అంతర్గత శత్రువులు దేశంలోనే ఉన్నారని ప్రకటించిన వాడు. ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, బౌద్ధులు, జైనులు వంటి ఇతర మతస్థుల్ని చంపేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చినవాడు. వారి ఇండ్లలోని తల్లులు, భార్యలు, అక్కాచెల్లెళ్లు ఎవరైనా సరే గర్భిణులు ఉంటే, వారి పొట్టల్ని చీల్చి, పుట్టబోయే పిల్లల్ని చంపేయాలని పిలుపునిచ్చిన ‘మహనీయుడు’ ఈ విషయాలన్నీ సావర్కర్ పర్సనల్ అసిస్టెంట్ లిబయ రాస్తే బైటకొచ్చినవే! అందువల్ల సావర్కర్‌ను విమర్శించడం నేరంకాదు, ప్రతి భారతీయుడి హక్కు. ఏ ప్రభుత్వమూ, ఏ సంస్థా ఇవ్వకపోయినా తనకు తానే ‘వీర్’ అనే పదం తన పేరుకుముందు తగిలించుకుని, ‘వీర్‌సావర్కర్’ గా ప్రాచుర్యంపొందిన నీచ ప్రవృత్తి గలవాడు సావర్కర్. తొలిదశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈ దేశ ప్రజలకు అర్థమైంది. అంతేకాదు, ఆనాటి బ్రిటీషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలుపాల య్యాడు. బైటకువచ్చి గాడ్సేను తయారుచేసి, ప్రోత్సహించి, గాంధీహత్యకు దోహదంచేశాడు. ఇలాంటివాణ్ని గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతిపిత స్థానాన్ని ఒక దేశద్రోహికి అంటగట్టాలనిచూస్తోంది. అందువల్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి కక్కడ కుతంత్రాల్ని బట్టబయలు చేయాలి. ఆధునిక భారతీయ చరిత్రలో నీచాతి నీచుడుగా మిగిలిపోయిన వాడు ఎవరూ? అంటే దేశప్రజలంతా ఏక కంఠంతో ‘సావర్కర్’ అని నినదించాల్సిన అవసరంఉంది. అందుకు అతనికి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలామంది చెప్పినవే. మరీ ముఖ్యంగా ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సావర్కర్ నైతికతను దుయ్యబడుతూ, ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోలో మాట్లాడారు. ఆనాటివిషయాలు నేటి తరానికి అందించాలన్న తపనకొద్దీ ఆయన మాట్లాడారు. విషయం పరిజ్ఞానం ఉన్న ఆ న్యాయమూర్తి జస్టిస్ కె.పాటిల్‌ను ఈ దేశప్రజలు నమ్ముతారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల ర్యాలీలలో తిరుగుతూ,తన స్థాయి మరిచి ప్రతిగల్లీ తిరుగుతూ మాట్లాడారు. భారత ప్రధాని ఆ సందర్భంలో ఆవును గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గోవు గురించి మాట్లాడడం ఏమైనా అపరాథమా? పవిత్రమైన గోమాత గురించి ఎవరైనా మాట్లాడొచ్చు’’ అని అన్నారాయన. అయితే ఆయన తెలుసుకోవలస్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. 1990లలో కూడా ఇప్పటివలెనే గోవునుగూర్చి చర్చలు జరిగాయి. ఆరోజుల్లో మహారాష్ట్రలో ‘భాలా’ పేరుతో ఒక పత్రిక వెలువడేది. అందులో ‘ప్రశ్నోతర్తరాలు’ శీర్షిక ఒకటి నడిచేది. అందులో ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. ‘‘నిజమైనహిందువు ఎవరూ?’’ అని! ‘‘ఎవరైతే గోవును పూజిస్తారో, సంరక్షిస్తారో వారే నిజమైన హిందువులు’’ అని కొంతమందిజవాబు రాశారు. అవన్నీ చదివి సావర్కర్ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఆ తర్వాత ఒక పుస్తకమే రాశాడు. దాని పేరు ‘‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్’’. ఆ పుస్తకాన్ని స్వాతంత్య్ర వీర్‌సావర్కర్ స్మారకసమితి ప్రచురించింది. సావర్కర్ ఆలోచనల్ని ఈ దేశ ప్రజలు చాలా నిశితంగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ‘‘దేశద్రోహ
దేశభక్తుడు’’ నేటి మోదీయోగీల జోడీకి ఆరాధ్యుడు. వారి దృష్టిలో మహానాయకుడు. ఒకదశలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం సావర్కర్ పేరు ఉచ్ఛరించడానిక్కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పటి నాయకులు ఆయనను నెత్తికెక్కించుకుని, జాతిపిత స్థానాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది అయ్యేపనికాదు. దేశప్రజలు చేతులు ముడుచుకుని ఏమీకూర్చోరు. సావర్కర్ ఎంతటి దేశద్రోహానికి తలపడ్డా, తనపుస్తకం ‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్’లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని ప్రభుత్వపెద్దలు శ్రద్ధగా మళ్లీమళ్లీ చదువుకోవడం అవసరం. ఎందుకంటే ఆ రాసినవాడు వారిదృష్టిలో మహానాయకుడు గనక! సావర్కర్ తన పుస్తకంలో ఇలా రాశాడు. ‘ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవజాతి స్థాయి నుంచి కిందికి దిగజారిన వారవుతారు...ఇంకా గోవు ఒక జంతువని, దానికిలేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటేఅది మూర్ఖత్వమవుతుందనీ’ స్పష్టంగా రాశాడు
వినాయక్ దామోదర్ సావర్కర్! అవు ఎంతటి నికృష్టపు జంతువంటే, అది తన మలంలోనే అదిపొర్లుతుంటుంది. దానికి బుద్దీ, జ్ఞానం ఉండవు గనకనే తను వేసిన పేడలో అది పొర్లుతుంటుంది’ అనికూడా రాశాడు. ఇదికాక, సావర్కర్ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు. మొఘలులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం తమనే వర్తిస్తుందన్న భ్రమలోఉండిపోయారనీ, అదెంత సిగ్గుచేటని రాశాడు సావర్కర్! సైనికులు,పౌరులు అందరూ అందరూ గోపూజచేస్తూ కూర్చు న్నందువల్ల యుద్ధం చేయగల ధైర్యం, నైపుణ్యం పోగొట్టుకున్నారని, యుద్ధ కౌశలం పొగొట్టుకున్నాక విజయాలెలా సాధిస్తారనీ ఒక రకంగా ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారణం నిస్సందేహంగా గోవే!’ అనిసావర్కర్ విశ్లేషించారు. దుర్గం, ఖిల్లా, కోట ఏదైనాసరే రక్షించుకోవడం ఈ గోపూజారుల వల్ల కాలేదు. అని తీర్మానించారు. ‘ఒక వేళ సైనికులకు యుద్ధ సమయంలో ఆహారం కొరత ఏర్పడితే, గోవుల్ని కోసుకుని తినాల్సింది. ఆలా చేసైనా తమ తమ రాజ్యాల్ని తాము కాపాడు కోవల్సింది’ అన్నది సావర్కర్ అభిప్రాయం.
‘‘గోపాలన్‌హవే గో పూజన్ నభే’’ (మరాఠీ శీర్షిక) గోవుల పాలన అవసరమే కానీ, గోపూజ వద్దు అనేది ఆ మరాఠీ శీర్షికకు అర్థం. ఈ శీర్షికతో సావర్కర్ ఏమి చెప్పారంటే …గోవు పాలిస్తుంది గనుక, మనుషులు దాన్ని పోషించుకోవాలి. కానీ వాటిని పూజించడం ఎందుకూ? అన్నది ఆయనప్రశ్న! ఆయనలాగే గోవుల్ని పూజించడం ఎందుకూఅని ఈ దేశప్రజల్లో కొందరు అనుకుంటే అది పొరపాటుకాదు. తప్పిదం కాదు. గోవుకు ఏ పవిత్రతాలేదు అంటే అది నేరమూ కాదు. ఈ విషయం నేటి ప్రధాని అతని అనుచరగణం కూడా అర్థంచేసుకోవాల్సి ఉంది. ఈ దేశంలో శ్వేతవిప్లవం కురియన్ నేతృత్వంలో గతంలో జరిగింది. పాల ఉత్పత్తిలో ఈ దేశం చాలా ముందుంది. ఇందులో ఇప్పటి ప్రభుత్వ పెద్దల కృషి ఏమీలేదు. వీరు అధికారంలోకి రాకముందే ఆ పని జరిగిపోయింది. ఇకపోతే గోమాంసం ఎగుమతులు ఎవరు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే బీజేపీ పెద్ద నాయకులే కదా! ఆ పని చేస్తున్నది? వీరిలో ముస్లింలు లేరు. అల్ కబీర్ అల్ దువా అంటూ ఉరుదూ పేర్లుపెట్టుకుని హిందువులే గోమాంసం ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే మన దేశం మొదటి రెండు స్థానాల్లో ఉంది. ప్రపంచస్థాయి గోమాంస విక్రేతల్లో మొదటి 20మంది హిందువులేనన్నది అధికారంలో ఉన్న వారు కావాలనే చెప్పరు. ఆ పని ముస్లింలు చేస్తున్నారనే భ్రమను దేశప్రజలకు కలిగిస్తారు. ‘చాలా తక్కువ ధరకు గో మాంసం అందిస్తామని’, ఇదే బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంలో గోవా ఓటర్లకు హామీలిచ్చారు. అదికూడా పక్కనగల కర్ణాటక నుండి తెప్పిస్తామంటారు. కర్ణాటకలో ఎవరి ప్రభుత్వం ఉందో మనకు తెలుసు. 17 జనవరి,1948న చివరిసారి సావర్కర్‌ను దర్శించుకోవడానికి నాథూ రామ్ గాడ్సే, ఆప్టే, బాడ్గే, శంకర్‌లు వెళ్లారు. నాథూరాం, ఆప్టేలు లోపలికి వెళ్లారు. మిగిలిన ఇద్దరు బైట కాపలాకాశారు. సావర్కర్‌ను కలిసి, నాధూరాం, ఆప్టేలు బైటకురాగానే ఆప్టే, బాడ్గేతో ఓ మాటచెప్పాడు. ‘‘యశస్వి హో ఉన్యా’’ విజయుడవై తిరిగిరమ్మని సావర్కర్, నాథూరామ్‌ను దీవించారని గాంధీకి నూరేళ్లు పూర్తయ్యాయనీ అనుకున్న ప్రకారం పథకం పూర్తవుతుందని సావర్కర్ ఆశగా ఉన్నాడన్న విషయం అప్టే బైట ఉన్న సహచరులకు చెప్పాడు. గాంధీజీ హత్యకేసులో సరైన ఆధారాలు దొరకక శిక్షపడలేదు కానీ, ఒకరకంగా సావర్కర్ నిత్యనూతన క్రిమినల్. చంద్రనాథ్ బసు అనే అతను ‘హిందుత్వ’ అనేపదాన్ని రూపొందిస్తే, దాన్ని విరివిగా వాడుకుని, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు సావర్కర్, ఒక దశలో సిక్కులు పంజాబ్‌ను సిక్కిస్థాన్‌గా చేసుకోవాలని, అందుకు తను సహకరిస్తాననీ అన్నాడు. పాకిస్తాన్, సిక్కిస్థాన్‌లు విడిపోతే, ఇక హిందూరాష్ట్ర (హిందుస్తాన్) మిగులు తుందని కలలుగన్నాడు. ఒకనాడు ఒక క్రిమినల్ కన్న కలల్ని నేటి ఈ కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలనుకుంటోంది. దేశంలో అదే ‘హిందుత్వ’ సెంటి మెంట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చి..ఎలాగైనా దొడ్డిదారిన మళ్లీమళ్లీ గెలవా లన్నదే వీరి ప్రయత్నం! ఉపాధి, అభివృద్ధి, ధరల తగ్గింపు వంటి వాటి గురించి వీరు ఏ మాత్రమూ మాట్లాడరు. ఆవు మూత్రం, ఆవుపేడల దగ్గర ఆగిపోయిన దేశనాయకుల మెదళ్లు
బహుశా వాటితోనే నింపుకున్నారేమో! అని నేటి యువతరం ఆనుకుంటూ ఉంది. ఏమైనా, ఈ దేశప్రజలు నాయకులను అనుసరించకుండా, స్వతంత్రంగా ఆలోచించడం అన్ని విధాలా మంచిది.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త