Friday, June 9, 2023
Friday, June 9, 2023

గాంధీని అవమానించిన గవర్నరు!

అరుణ్‌ శ్రీవాత్సవ

స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీని కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అవమానించి తన అజ్ఞానాన్ని బైటపెట్టుకున్నారు. గాంధీకి లా డిగ్రీ కూడా లేదని ఎగతాళి చేశారు. ఆయన ఇట్లా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే కాషాయదళాలకు గాంధీపై ఏ మాత్రం గౌరవం లేదని ఆయన చెప్పిన ఆంశాలను కూడా ఖాతరు చేయరు. స్వాతంత్య్రపోరాట చరిత్రలేని కాషాయదళాలకు ఇంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుందని భావించడం కూడా కష్టమే. గాంధీకి యూనివర్సిటీ డిగ్రీ ఒక్కటికూడా లేదని సిన్హా వ్యాఖ్యానించి ఏమాతర్ర విద్య, విజ్ఞానం కూడా లేదని నిరూపించుకున్నాడు. సిన్హాకు విద్య, దివాళాకోరుతనం అసాధారణమైన విషయం ఏమీకాదు. సరిహద్దుల్లో కీలకమైన రాష్ట్రం కశ్మీరు. ఇంతటి ప్రాముఖ్యతగల రాష్ట్ర గవర్నర్‌కు గాంధీని గురించి ఏమాత్రం తెలియదని ఎవరూ భావించరు. జమ్ము`కశ్మీర్‌లో విద్య, సాంస్కృతిక రంగాలను అభివృద్ధి పరచేందుకు సిన్హాను ఆ రాష్ట్రానికి పంపారు. మరిఎందుకు ఇలా నిరక్షరాస్యుడిగా వ్యాఖ్యానం చేశారన్నది ఆయనకే తెలియాలి. కనీసం గాంధీ స్వీయచరిత్ర ‘‘మై ఎక్స్‌పరిమెంట్స్‌ విత్‌ ది ట్రూత్‌’’ అనే పుస్తకం కూడా ఆయన చదవలేదని అర్థమవుతోంది. ఈ పుస్తకంలో తన గురించి గాంధీ పూర్తి వివరాలను పేర్కొన్నారు. తనలో ఉండే లోపాలను, బలహీనతలనుసైతం బహిరంగంగానే వెల్లడిరచారు. కాషాయదళాల నాయకుడులాగా నటించడం, కపటం గాంధీకి తెలియదు. ఇలాంటి వారు బీజేపీలో అనేకమంది ఉన్నారు. మంచి ఉదాహరణగా నరేంద్ర మోదీని కూడా చెప్పుకోవచ్చు.
బీజేపీ లోక్‌సభ సభ్యుడు ఒకరు ఇలాగే మాట్లాడుతుంటారు. అందువల్ల అతని వ్యవహారాన్ని కూడా ప్రజలముందు ఉంచేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రి గట్టి పోరాటమే చేశారు. గతంలో మోదీకి అత్యంత ప్రియమైన నాయకుల్లో ఇరానీ కూడా తన విద్యార్హతలను చెప్పేందుకు తిరస్కరించి వార్తలకెక్కారు. తాము చెప్పేవి 100శాతం తప్పు అని తెలిసినప్పటికీ బీజేపీ నాయకులు తమదే రైటని వాదించడానికి ఏమాత్రం వెనుకాడరు. తప్పులను కూడా ఒప్పులుగా చెప్పుకునేవారిని నిజంగా ప్రశంసించాల్సిందే. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసుకోవడంలో వీళ్లు ముందుంటారు. సిన్హాకూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. అందువల్ల సిన్హాను కూడా అభినందించాలేమో. వారం రోజుల క్రితం గ్వాలియర్‌ ఐటీఎమ్‌లో డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా స్మారకసభలో సిన్హా ప్రధానోపన్యాసం చేశారు. అప్పుడు గాంధీకి ఒక డిగ్రీకూడా లేదని మీకు తెలుసా? అని విద్యార్థులను ప్రశ్నించారు. గాంధీకి ఉన్న అర్హత హైస్కూలు డిప్లమో మాత్రమేనని అవమానించారు. లా డిగ్రీ లేకపోయినా లాయర్‌గా పనిచేసేందుకు అర్హత సంపాదించారు. డిగ్రీ లేనివారు చదువుకున్న వాడు ఎలా అవుతాడు? అనికూడా ప్రశ్నించాడు. అయితే దేశంకోసం గాంధీ ఎంతో చేశాడనిమాత్రం అంగీకరించాడు. ఆయన సత్యాన్నే నమ్ముతాడని ఆయన చేసిందల్లా ఇదొక్కటేనని విద్యార్థుల ముందు తన అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఎన్ని సవాళ్లు ఎదురైనా సత్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదన్నాడు. అందువల్లనే ఆయన జాతిపిత అయ్యారని చెప్పారు. బహుశ: రాజకీయ వత్తిళ్లవల్లనే ఈ మాటలైనా చెపుతుంటారని భావిస్తున్నారు. ఇలా అజ్ఞానంగా మాట్లాడిన సిన్హాకు సరైన సమాధానం చెప్పవలసింది గాంధీ మునిమనవడు తుషార్‌గాంధీయే. మహత్మాగాంధీ రాజ్‌కోట్‌లోని ఆల్‌ఫ్రెడ్‌ హైస్కూల్‌ నుంచి ఒక మెట్రిక్‌, లండన్‌ నుండి ఈ మెట్రిక్‌తో సమానమైన బ్రిటీష్‌ మెట్రిక్యులేషన్‌ పాసయ్యారని తుషార్‌గాంధీ వివరించారు. అలాగే బ్రిటన్‌లోని ఇన్నర్‌టెంపుల్‌ లా కాలేజీనుంచి లా డిగ్రీ పొందారు. అలాగే లాటిన్‌లో ఒకటి, ఫ్రెంచ్‌లో మరొకటి, రెండు డిప్లమోలని పొందారని తుషార్‌ తెలిపారు. ఇతరుల భావాలనుకూడా మన్నించాలన్న విషయాలను ఆర్‌ఎస్‌ఎస్‌ స్కూళ్లలో బోధించరని దీన్నిబట్టి అర్థమవుతోంది. తాముచెప్పిందే సరైనదని నమ్ముతూ వాదిస్తారు. మహాత్మాగాంధీ రాసిన ఆటో బయోగ్రఫీ పుస్తకం కాపీని సిన్హాకు పంపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పులను ప్రచారం చేసే కళను కశ్మీర్‌ గవర్నర్‌కూడా అలవరచుకుని మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img