Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

గార్సెటీ వ్యాఖ్యలపై స్పందించని మోదీ

ఎం. కోటేశ్వరరావు

ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీగడ్డమీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మనదేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విభేదా లతో నిమిత్తం లేకుండా అందరం ఒక్కటై ఖండిరచాలి. రాహుల్‌ గాంధీ విదేశాల్లో నరేంద్రమోదీ సర్కార్‌ మీద చేసిన విమర్శల సందర్భంగా కాషాయ మార్కు దేశభక్తి ప్రబోధకులు చెప్పిన అంశాల సారమది. నిజమే కదా అంటే నిజమే అని అనేక మంది అనుకుంటున్నారు. మన దేశంలో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెటీ అనేపెద్ద మనిషి ఉన్నారు. భారత్‌ కోరితే మణిపూర్‌ మంటలను ఆర్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని గార్సెటీ చెప్పాడు. అది మన అంతర్గత అంశం, మరొకరు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. కొల్‌కతాలో జూలై ఆరవ తేదీన గార్సెటీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘‘మణిపూర్‌లో జరుగుతున్న హింస వ్యూహాత్మక సంబంధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మానవ సంబంధమైనది. ఇలాంటి హింసలో పిల్లలు, ఇతరులు మరణిస్తున్నపుడు ఒక భారతీయుడిగా మీరు రక్షించేందుకు చూడరా. అనేక మంచి పరిణామాలు జరగాలంటే ముందు శాంతి నెలకొనాలని మనకు తెలుసు. ఈశాన్య, తూర్పు భారతాల్లో ఎంతో పురోగతి ఉంది. తమను కోరితే ఏ విధంగానైనా సాయపడేందుకు మేము సిద్దంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు, అక్కడ తక్షణమే శాంతి నెలకొనాలని మేము ప్రార్ధిస్తాము. శాంతి నెలకొంటే మేము మరింత భాగస్వామ్యం, మరిన్ని ప్రాజెక్టులు, మరిన్ని పెట్టుబడులు తెస్తాము’’ అన్నాడు. మరొక దేశమైతే తక్షణమే అతడిని పిలిచి హద్దుల్లో ఉండాలని మందలించి పంపేది. ఆఫ్రోఅమెరికన్ల మీద జరిగే దాడుల గురించి లోకానికంతటికీ తెలుసు. ప్రజా స్వామ్యానికి పుట్టినిల్లు భారత దేశమని చెప్పిన ప్రధాని మోదీ దీనిపై ఒక్క మాటా మాట్లాడలేదు. నాడు జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనను అని రాసిచ్చిన సావర్కర్‌ తరువాత దానికి కట్టుబడి ఉన్న అపర దేశభక్తుడు. ఇప్పుడు నరేంద్రమోదీ కూడా అమెరికాకు ఖాళీ కాగితం మీద సంతకాలు చేసి ఇచ్చారా? రాయబారిని మందలిస్తే అమెరికాకు ఆగ్రహం వస్తుందని భయపడుతున్నారా ? చిత్రం ఏమంటే రాహుల్‌ గాంధీ విదేశాల్లో మన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోదీని విమర్శిస్తే అది దేశద్రోహం. కానీ అమెరికా రాయబారి మన గడ్డమీద మణిపూర్‌ మంటలను మీరు ఆర్పలేకపోయారు, మీరు కోరితే ఆర్పటంలో తాము సాయం చేస్తామని చెప్పటం కంటే మన కేంద్ర ప్రభుత్వానికి అవమానం మరొకటి ఉండదు. అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసి నట్లు ఉంది. అరిందమ్‌ బాగ్చీ అని మన విదేశాంగ శాఖ ప్రతినిధి ఉన్నారు. దాదాపు రోజూ ఏదో ఒక అంశం మీద విలేకర్లతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎరిక్‌ గార్సెటీ మాట్లాడిన అంశాల గురించి తనకు తెలియదని అన్నారు. విదేశీ దౌత్యవేత్తలు మన అంతర్గత అంశాల గురించి మాట్లాడటం అసాధారణం. అతను ఏం మాట్లా డిరదీ కచ్చితంగా తెలుసుకొనేంతవరకు తానేమీ వ్యాఖ్యా నించలేనని కూడా అరిందమ్‌ చెప్పారు. మణిపూర్‌లో శాంతికోసం భారత ప్రభుత్వం, భద్రతాదళాలు పని చేస్తున్నాయని అన్నారు. పదకొండవ తేదీ వరకు విదేశాంగ ప్రతినిధి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఏ మాట్లాడిరదీ ముఖతా తెలుసుకొనేందుకు అమెరికా రాయబారిని పిలిచారన్న వార్తలు కూడా లేవు. నాకు సరిగ్గా తెలియదు అని చెప్పటం అరిందమ్‌ బాగ్చీకి కొత్తకాదు. భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటనలు గుప్పించటంలో అమెరికా గద్దె మీద ఎవరున్నా తక్కువ తినలేదు. ఇరవైనెలల పాటు ఖాళీగా ఉన్న తరువాత ఎరిక్‌ గార్సెటీని మన దేశంలో రాయబారిగా జో బైడెన్‌ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆ మేరకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. పౌరసత్వ చట్ట సవరణ గురించి, భారత్‌లో మానవహక్కుల గురించి గార్సెటీ గతంలో విమర్శలు చేశాడు. రాయబారిగా ఖరారు చేసిన తరువాత వాటి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ? ఇటీవల అతను ఏం మాట్లాడాడో తెలియదు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఉన్నాయి, అవి చాలా పాతవి, వాటి మీద మన వైఖరి ఏమిటో మీకు బాగా తెలిసిందే అన్నారు. ‘‘తప్పుడు అభిప్రాయాలతో మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజకీయ అజెండాతో అతన్ని పంపుతున్నారు. అతనికేమీ తెలియదు, అహంకారి, అతన్ని ఆమోదించ కూడదు’’ అని బీజేపీ మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ ట్వీట్‌ చేశారు. అతని నియామకం పశ్చిమ దేశాల వ్యతిరేక మనోభావాలను రగిలిస్తుందని బీజేపీి యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాష్‌ అన్నారు. కేరళలో కమ్యూనిస్టులంటే గిట్టని సత్యదీపం అనే పత్రిక ప్రధాని నరేంద్రమోదీకి ఉక్రెయిన్‌ పోరుగురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి సమయం ఉంటుంది గానీ, మణిపూర్‌ గురించి మాత్రం పట్టదు అని విమర్శించింది. మోదీ మన్‌కీ బాత్‌లో అడవుల్లో పెరిగే గడ్డి గురించి కూడా మాట్లాడుతారు గానీ, మణిపూర్‌లో ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోరు. ఈశాన్య రాష్ట్రాలలో 30సార్లకు పైగా ప్రధాని పర్యటించి ఉంటారు. మణిపూర్‌కు మాత్రం కావాలనే వెళ్లటం లేదు అని సంపాదకీయంలో పేర్కొంది. ఈ పత్రికను అంగామలీ సిరోమలబార్‌ చర్చ్‌ నడుపుతుంది. ఆ పత్రిక చర్చి నేతలను కూడా వదల్లేదు. తొలి రోజుల్లో మణిపూర్‌ హింసాకాండను చర్చి నేతలు విస్మరించారన్నది నిజం. ప్రకటనలు చేయటంతప్ప వారు ఇప్పటికీ హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దంగా లేరు, కనీసం దిల్లీలో పత్రికా విలేకర్ల సమావేశంపెట్టే ప్రయత్నం కూడా లేదు అని పేర్కొన్నది. మండుతున్న మణిపూర్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా ప్రధాని మోదీలో చలనం లేదు. ఇంత హింసాకాండ, రచ్చకు కారణం మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న మెయితీ తెగవారిని షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని, సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించటమే. అలాంటి అధికారం హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరులను వెల్లడిరచలేదు. జనాభాలో హిందువులైన మెయితీలు 53శాతం ఉండగా, క్రైస్తవులుగా ఉన్న గిరిజనులు 40శాతం. అరవైమంది ఉన్న అసెంబ్లీలో నలభైమంది మెయితీలు ఉన్నారు. వారు బీజేపీి ఓటు బాంకుగా ఉన్నారు. జరుగుతున్న హింసాకాండలో మెయితీలకు పోలీసులే ఆయుధాలు ఇచ్చారని, పోలీస్‌ స్టేషన్ల నుంచి అపహరించినట్లు కేసులు నమోదుచేశారని వార్తలు వచ్చాయి. హింసాకాండ ప్రారంభమైన 70 రోజుల నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. తాజా పరిణామాలలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బీజేపీిదే బాధ్యత అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img