టొమస్ లియిగ్టన్
కస్ట్, గాబ్రియల్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్నప్పటికీ వామపక్ష అభ్యర్థికి గణనీయమైన మద్దతు, సమాజంలో గౌరవం ఉన్నాయి. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సామాజిక ఆందోళన బాగా పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ కమిటీ ఏర్పాటుకు అవసరమైన పరిస్థితిని గాబ్రి యెల్ కల్పించారు. పినెర ప్రభుత్వంపై అసంతృప్తి బాగా పెరిగింది. గాబ్రియెల్ పార్లమెంటుకు ఎన్నికవడానికి ముందు చిలీ దక్షిణ ప్రాంతంలోని మగల్లనెస్ ఏరి యాలో 2011లో జరిగిన విద్యార్థి ఉద్యమాలలో ప్రముఖ నాయకుడిగా ఎది గారు. అనంతరం చిలీ యూనివర్సిటీ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికాలో ఈ విద్యార్థి సమాఖ్య అత్యంత పురాతనమైంది
లాటిన్ అమెరికాలో ముఖ్యమైన దేశం చిలీ. ఈ దేశంలో అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. విశాల ఫ్రంట్ అభ్యర్థిగా వామపక్ష నాయకుడు గాబ్రియెల్ బొరిక్ పోటీ చేస్తున్నారు. ఇంతవరకు గాబ్రియెల్కే అత్యధిక ప్రజల మద్దతు ఉన్నదని, ఇతర అభ్యర్థుల కంటే చాలా ముందంజలో ఉన్నారని సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజకీయ భవిష్యత్తుకి ఈ ప్రాంత దేశాలన్నిటికీ చిలీ ఎన్నికల ఫలితం చాలా కీలకమైనది. చిలీ అధ్యక్ష ఎన్నికల ఫలితం లాటిన్ అమెరికా దేశాల పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పోటీలో ఉన్న అత్యంత మితవాద అభ్యర్థి జోస్ ఆంటోనియో కస్ట్ కూడా వేగంగా తన మద్దతు పెంచుకుంటున్నారు. మధ్యేవాదమితవాద పక్షం బాగా దెబ్బతిన్నది. గాబ్రియెల్, కస్ట్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. చిలీలో ఇటీవల వరకు మధ్యేవాద
మితవాద, మధ్యేవాద`వామపక్ష ప్రభుత్వాలే పరిపాలిస్తున్నాయి.
మితవాద భావాలు ఎక్కువగా ఉన్న సెబాస్టియన్ పినెర స్థానంలో కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకే ఎన్నికలు జరగనున్నాయి. 2019లో చిలీలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు సాగినప్పుడు అనేక ఇతర దేశాలు పినెర ప్రభుత్వ చరిత్రా త్మక తప్పులపై శల్య పరీక్ష చేశాయి. పినెరపై నిఘా పెట్టాయి. ఆందోళన కారులపై దౌర్జన్యం, వారి మానవ హక్కుల ఉల్లంఘనలను పోలీసులు పదేపదే కొనసాగించారు. ఇదే సమయంలో ఎన్నికలు ముగిసిన తరువాత ఏడాదిలోపు నూతన రాజ్యాంగ కమిటీ ఏర్పాటు కూడా జరగవలసి ఉంది. ఈ కమిటీ నూతన రాజ్యాంగ ముసాయిదాను రూపొందిస్తుంది. 1980లో తయారు చేసిన ‘‘పినోఛెట్ రాజ్యాంగం’’ స్థానంలో కొత్త రాజ్యాంగం అమలులోకి వస్తుంది. పినెర వార సుడిగా బరిలో దిగిన సెబాస్టియన్ సిచెల్ ఎన్నికల ప్రచారం పూర్తిగా ఆగి పోయింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పాండొర పేపర్ల కుంభకోణంలో పినెర పేరు కూడ వెలుగులోకి రావడంతో సిచెల్ ప్రచారం పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. డొమింగ మైనింగ్ కంపెనీ విక్రయంలో పినెర అక్రమాలకు పాల్పడి నట్లు వెల్లడయ్యింది. ఈ కంపెనీ విక్రయాన్ని బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్‌లో నిర్వహించారు.
వర్టిన్ ఐలాండ్స్‌లో పన్నుల చెల్లింపు ఉండదు. అందువల్లనే అక్కడ కంపెనీని విక్రయించారు. కంపెనీ విక్రయ పత్రాల పైన అధ్యక్షుడైన పినెర కుటుంబ సభ్యులు రహస్యంగా సంతకాలు చేశారు. వాతావరణ ప్రమాణాలు పాటించ కుండా మైనింగ్ కంపెనీల కార్యకలాపాలకు అనుమతించటం ద్వారా కొను గోలుదార్ల వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు అనంతరం పార్లమెంటులో (నేషనల్ కాంగ్రెస్) పినెరపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వం ఆస్తుల విక్రయశాలగా మారింది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికలు వామపక్ష అభ్యర్థి గాబ్రియెల్‌కు అనుకూలంగా మారాయి. గాబ్రియెల్ విజయం తథ్యమని ఎన్నికల పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు. పినెర వారసుడిగా పోటీలో పూర్తిగా వెనుకబడిపోయిన సెబాస్టియన్ సిచెల్ స్థానంలో మితవాద అభ్యర్థి కస్ట్ను ప్రమోట్ చేసేందుకు మితవాదులు మీడియాను ఉపయోగించుకొంటున్నారు. కస్ట్ ఎలాంటి వాడంటే డొనాల్డ్ ట్రంప్, జైర్ బొల్సొనరొ లాంటివాడు. కస్ట్ చాలా కాలంగా రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. 1996 నుండి అధికార పదవులలో పని చేశాడు. కస్ట్ 2017 ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు.
కస్ట్, గాబ్రియల్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్నప్పటికీ వామపక్ష అభ్యర్థికి గణనీయమైన మద్దతు, సమాజంలో గౌరవం ఉన్నాయి. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సామాజిక ఆందోళన బాగా పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ కమిటీ ఏర్పాటుకు అవసరమైన పరిస్థితిని గాబ్రి యెల్ కల్పించారు. పినెర ప్రభుత్వంపై అసంతృప్తి బాగా పెరిగింది. గాబ్రియెల్ పార్లమెంటుకు ఎన్నికవడానికి ముందు చిలీ దక్షిణ ప్రాంతంలోని మగల్లనెస్ ఏరి యాలో 2011లో జరిగిన విద్యార్థి ఉద్యమాలలో ప్రముఖ నాయకుడిగా ఎది గారు. అనంతరం చిలీ యూనివర్సిటీ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లాటిన్ అమెరికాలో ఈ విద్యార్థి సమాఖ్య అత్యంత పురాతనమైంది. విద్యార్థులు, యువకులు గాబ్రియెల్‌కు ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు. దశాబ్ది కాలంగా నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా దేశభక్తిని ప్రదర్శించే యువతరం ఉద్యమంలో గాబ్రియెల్ కీలకమైన పాత్ర నిర్వహించారు. 2013లో గాబ్రియెల్ డిప్యూటీగా ఎన్నికయ్యారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఎన్నికైన మొదటి అభ్యర్థి ఆయనే. 2017లో వామపక్ష పార్టీలతో కూడిన విశాల ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటుకు వామపక్ష పార్టీలు, సంఘాలు పూర్తిగా మద్దతు తెలిపాయి. విశాల ఫ్రంట్‌లో చిలీ కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్షాలు ఉన్నాయి. గాబ్రియెల్ వామపక్ష మద్దతుదారుల నుండే గాక ఇతర విభాగాలలోని ఓటర్ల తోడ్పాటును కూడా పొందారు.