Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

జూలో మనిషి

రా బావ ఏంటి ఈ రోజు చాలా కోపంగా విసుగ్గా కనబడు తున్నావు. చాలాకోపంగా ఉన్నట్లున్నావు ముందు కాఫీతాగు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు ఏంటి కథ. ఏంటి చెప్పేది అసలు మనిషివేనా. నేను మాత్రం మనిషినికాదు జంతువుకంటే హీనం. ఉన్నట్లుండి ఇంత కఠోరంగా మాట్లాడడానికి కారణంఏంటి. ఏం చెప్పాలి పంజరంలో చిలుక, బోనులో ఎలుక, ఇంట్లో నేను, పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. జంతువులు అడవిలో హాయిగా తిరుగు తున్నాయి. రోడ్డుమీద కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కానీ ఆకాశాన్నంటి విశ్వాన్ని శోధించిన మనిషికి స్వేచ్ఛ Ûలేదు. లక్షల మంది ప్రాణాలర్పించి స్వాతంత్య్రంపొందాం. ఇక నుండి మనల్ని మనమే పాలన చేసుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటాం. ఇక మనది ప్రజాస్వామ్యదేశం అన్నారు ఆనాడు గాంధీ, నెహ్రూలు. అవును ఇప్పడే ముంది నీకు, నాకంటావేంటి? నీకు వాక్‌ స్వాతంత్య్రం ఉందా. నీ మాటకు సమాజంలో విలువుందా. ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాల్లో స్వేచ్ఛ లేదన్నారు. ఇక్కడుందా. ప్రస్తుతం బిజేపీ పాలనలో మనిషికి స్వేచ్ఛ ఉందా. స్వేచ్ఛ లేక వ్యక్తిత్వంకోల్పోయిన మనిషి జంతువుతో సమాన మన్నాడు వావిలాల. అందుకే ఆయన ఏపార్టీలో చేరలేదు. అయినా ఆయన తనవ్యక్తిత్వం కోల్పోకుండానే ఏ రాజకీయపార్టీ అండలేకుండానే పద్మవిభూషణ్‌ సాధించాడు. అందుకే మనకు మాత్రం పార్టీలు అవసరమా. భలే వాడివి బావ అయిపోయిందా ఇంకా ఉందా ఏంటి నీకు ఎగతాళిగా ఉందా, నీకు తెలుసుగా కొన్నాళ్లు ఉద్యోగం వెలగబెట్టా ఆ తరువాత రాజకీయాల్లో తిరిగా, ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టా. ఆ తరువాత పత్రికా రంగంలో పనిచేస్తున్నా కానీ నా కెక్కడా స్వేచ్ఛ కనబడలా. నిజమే బావ ప్రజాస్వామ్యం పేరిట అప్రజాస్వామ్య పాలన అనేకంటే ప్రస్తుతం నియంతపాలన సాగుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో చాలా చోట్ల ఇలా జరుగుతున్నా అన్నింటిని మించి నియంత పాలన మన దేశంలోనే సాగుతోంది. స్వేచ్ఛలేని మనిషి జంతువుతో సమానం. అవి అడవుల్లోనన్నా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఆ పాటి స్వేచ్ఛ మనకులేదు. దేనికంటే రాజులపాలన, ఆ తరువాత ఆంగ్లేయుల పాలన ఎరుగని పెద్దలు అంటున్నారు. అవి సరే బావ నువు, నేను పల్లెల్లో బతికి పట్టణానికి చేరాం. మన చిన్నతనంలోన పల్లెల్లో ఉన్న స్వేచ్ఛ ఇపుడు అక్కడకూడా లేదు. రాజకీయాలు గ్రామాలకు, వార్డులకు చేరిపోయి నందున అక్కడ కూడా రాజకీయ కక్షలతో కత్తులతో నరుక్కోవడం చూస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాలవల్ల వృద్ధ్ధాప్యంలో కనిపెంచిన బిడ్డలు వాళ్ల దగ్గర లేక వృద్ధాశ్రమాలు వెతుక్కోవడం చూస్తున్నాం.
ఇటువంటి దుర్భర పరిస్థితి వస్తుందని మనం ఊహించలేదు. అది సరే రాజకీయ కాలుష్యం వల్ల గ్రామాల్లో సైతం వర్గవిభజన జరుగు తుంది. కుల,మత,వర్గరహిత సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఇంకా ముందుకెళ్లి రామరాజ్య స్థాపనకోసమై పోరాటమన్నారు ఆరోజు గాంధీ, నెహ్రూలు. కాని ప్రస్తుతపాలన అందుకు భిన్నంగా మోదీ,షాలు సాగిస్తున్నారు. నిజమే వారిని గద్దెదించడానికి వామపక్షపార్టీలు సై అన్నా కొన్ని రాష్ట్రాల నాయకులు ముందుకు రావడం లేదుకదా, అది నిజమే ప్రస్తుతం పార్టీ లేకుండా ఒంటరిగా ఒక మంత్రిని కలువలేదు. కానీ పార్టీలు దిగువ మనిషిని పట్టించుకోవడం లేదు. వ్యక్తిగతంగా నా మనో భావాలు వెల్లడిరచే స్వేచ్ఛలేదు. ఒంటరిగాచెప్పినా అవి పత్రికలలో రావు. పార్టీలు, సంఘాలు సంస్థల్లో ఎందులోనూ స్వేచ్ఛలేదు. ఈ పరిస్థితిల్లో ఏం చేయాలో అర్థం కావడంలేదు. స్వేచ్ఛలేని బతుకు నేను బతకలేను. ఆగు బావ అంతగా ఆలోచించకు. మన కంటే మేధావులు ఎక్కువ బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. సమస్యకు చావు పరిష్కారం కాదు. మీరేం చేయాలి. ప్రజాస్వామ్యవాదుల్ని అభ్యుదయ రచయితల్ని అణచివేసింది. బీజేపీ ప్రభుత్వం ఆ స్థితిలో ఏం చేయాలో చెప్పు. భారతీయులు శిశుపాలుని విషయంలో శ్రీ కృష్ణుడు లెక్క పెట్టినట్లు ఈ బీజేపీ చేసే తప్పుల్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడకపోయినా వీరిని కూడా పట్టించు కోకుండా తమ ఓటు ద్వారా చరమగీతం బీజేపీకి పాడుతారు. ఏమో నువు ఎన్నిచెప్పినా వ్యక్తిత్వం చంపుకుని నేను జూలో జంతువులాగ ఇంటికిపరిమితమై బతకలేను. ఆగవయ్యా నీలాగానే ఆలోచించి నక్సలైటుగా మారి ఎందరో యువకులు చనిపోతున్నారు. కర్ణుని చావుకు వంద కారణాలన్నట్లు వీరికి కూడా టైము దగ్గర పడుతుంది. ఏమో నాకు నమ్మకం కుదరడంలేదు. ఎంతో క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు పార్టీల ఏలుబడిలో ఉన్న బీజేపీ మతచిచ్చు రగిలిస్తే స్థానికులు కులచిచ్చు రగిలిస్తున్నారు. బెంగాల్‌, త్రిపురలో కూడా వారి చేయి జారిపోయాయి. ప్రస్తుతం ఆప్‌పార్టీ నేతలను కేసుల్లో ఇరికించి దిల్లీ, పంజాబులలో కూడా ప్రవేశించి దుర్మార్గపు క్రీడ మొదలుపెట్టారు. అదే నే చెప్పేది. నీకొక్కడికే కాదు రాష్ట్రాన్ని పాలించే నేతలు కేసుల వల్ల జైలు పాలవుతున్నారు. అది సరే ఇలా జరగడానికి కారణమేమిటంటావు. ఏముంది ప్రతిపార్టీలో ఎవరో ఒకరు స్వార్థం కొద్దీచిన్న తప్పు చేస్తే దానివల్ల పార్టీ నాశనమవు తోంది. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ లేదన్న వావిలాల పత్రికలలో స్వేచ్ఛ లేదన్న నార్ల అందుకు మరణం శరణ్యమని వారనుకోలేదు. వారు ఎంచు కున్న దారిలో తుదివరకు ప్రయాణించారు. నువు వ్యక్తిగతంగా ఏం చేయ గలవని ఆలోచించు. నియంతృత్వ పాలన గురించి నువు పదిమందికి చెప్పి ఒక్కక్కరు పదిమందిని చేర్చేట్లు చూడు. ఇలా కొంతకాలానికైనా ప్రజల్లో మార్పువచ్చి ఓటును సద్వినియోగం చేస్తారు.
సెల్‌: 98855 69394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img